Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?

ఒక పక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో పక్క ఒమిక్రాన్ పేరుతో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒమిక్రాన్ కు సంబంధించిన సినిమా ఒకటి 1963లో వచ్చినట్టుగా ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది.

Fact Check: రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఒమిక్రాన్ సినిమా ఉందా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా?
Fact Check Omecron Movie Poster
Follow us
KVD Varma

|

Updated on: Dec 03, 2021 | 6:56 PM

Fact Check: ఒక పక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మరో పక్క ఒమిక్రాన్ పేరుతో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒమిక్రాన్ కు సంబంధించిన సినిమా ఒకటి 1963లో వచ్చినట్టుగా ఓ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. ఆ పోస్టర్ మీద ‘ది ఓమిక్రాన్ వేరియంట్’ అనే టైటిల్ ఉంది. దీనిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ ”నమ్మండి..నమ్మకపోండి.. ఈ చిత్రం ఈ చిత్రం 1963లో వచ్చింది, దీని ట్యాగ్‌లైన్ చూడండి.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్ వైరల్ అయింది. అంతేకాకుండా చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో ఈ పోస్టర్ విపరీతంగా షేర్ అవుతూ వస్తోంది.

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ఇదీ..

ఈ పోస్టర్ గురించి శోధించినపుడు షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని గూగుల్ లో సెర్చ్ చేయగా.. ఈ పోస్టర్ కి ఆ పేరుతో ఉన్న సినిమాకీ సంబంధం లేదని తేలింది. అసలు అటువంటి సినిమా ఏదీ లేదనే విషయం తెలిసింది.

అసలు పోస్టర్ ఇదీ..

Omicron Movie Original Poster

వైరల్‌గా మారిన పోస్టర్‌లో నిజమెంతో తెలుసుకునేందుకు గూగుల్‌లో వైరల్‌గా మారిన పోస్టర్‌ని రివర్స్ సెర్చ్ చేసినపుడు abandomoviez , E-bay , todocoleccion అనే వెబ్‌సైట్‌లో దాని అసలు పోస్టర్‌ కనిపించింది. abandomoviez వెబ్‌సైట్‌లో కనిపించే చిత్రం అసలైన పోస్టర్‌లో, ఇది స్పానిష్ భాషలో ఉన్న టైటిల్ అది ఇలా ఉంది.” sucesos en la IV” అంటే నాల్గవ దశలో ప్రోగ్రామ్. ఇక స్పానిష్ చలనచిత్రం sucesos en la IV దశ అసలైన కవర్ టోడోకోలెసియన్ అనే ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో ఈ కవర్ ధర 12 యూరోలు. అదేవిధంగా ఈ స్పానిష్ సినిమా ముఖచిత్రం ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఇ-బేలో కూడా అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌లో ఈ కవర్ ధర 10 డాలర్లు.

మార్చిన పోస్టర్ ఇదీ..

Original And Fake Omicron Movie Poster

IMDb వెబ్‌సైట్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా దొరికింది. వెబ్‌సైట్ ప్రకారం, ఇది సెప్టెంబర్ 1974లో విడుదలైన కల్పిత చిత్రం. ఇందులో ఎడారి చీమలు, మనుషుల మధ్య జరిగే యుద్ధాన్ని చూపించారు. ఆ చీమలతో పోరాడి ప్రజలను రక్షించే ఇద్దరు శాస్త్రవేత్తలు, ఒక అమ్మాయి ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు.

వెబ్‌సైట్‌లో స్పానిష్ సినిమా ఒరిజినల్ పోస్టర్ చూడగానే వైరల్ అయిన పోస్టర్ ఎడిట్ అంటే ఫేక్ అని తెలిసింది.

Omicron అనే చిత్రానికి సంబంధించిన కీలక పదాలను Googleలో శోధిస్తే IMDb వెబ్‌సైట్‌లో Omicron చలన చిత్రం పూర్తి సమాచారం లభించింది. మీరు కూడా ఈ విధంగా సెర్చ్ చేసి చూడండి. ఈ వెబ్‌సైట్ ప్రకారం..

  • ఒమిక్రాన్ 1963లో విడుదలైన కామెడీ ఫిక్షన్ చిత్రం.
  • ఈ చిత్రంలో, గ్రహాంతరవాసులు భూమి నుండి మానవ శరీరాన్ని తమతో తీసుకువెళతారు. ఈ మానవ శరీరంతో మానవులను పట్టుకోవాలని ప్రయత్నిస్తారు.
  • ఈ ఒమిక్రాన్ సినిమాకి.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కీ ఏమాత్రం సంబంధం లేదు.

‘ది ఓమిక్రాన్ వేరియంట్’ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సినిమా పోస్టర్ ఎడిట్ చేసింది అంటే ఫేక్ అని స్పష్టం అవుతోంది.

ఇవి కూడా చదవండి: Omicron Confusion: ప్రపంచ నిపుణులను తికమక పెడుతున్న ఒమిక్రాన్.. ఈ వేరియంట్ ప్రభావంపై విభిన్నఅంచనాలు.. మూడో వేవ్ తప్పదా?

Omicron Outbreak: వణికిస్తున్న ఒమిక్రాన్ విస్తరణ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉనికి.. హాట్‌స్పాట్‌గా ఆ సిటీ!

Personal Loan: ఇన్‌కం ప్రూఫ్ లేకుండా పర్సనల్ లోన్ వస్తుందా? దీనికోసం ఏ పధ్ధతి అనుసరించాలి? తెలుసుకోండి!

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌