Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput : కన్నడ ఇండస్ట్రీ పై కన్నేసిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో పాయల్

ఒక్క సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ మొదటి సినిమాతోనే ఏ మాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసింది..

Payal Rajput : కన్నడ ఇండస్ట్రీ పై కన్నేసిన హాట్ బ్యూటీ.. స్టార్ హీరో సినిమాలో పాయల్
Payal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2021 | 10:50 AM

Payal Rajput : ఒక్క సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ మొదటి సినిమాతోనే ఏ మాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసింది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో పాయల్‌కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. రవి తేజ, వెంకటేష్ లాంటి హీరోల సినిమాల్లో పాయల్ కు ఛాన్స్ లు వచ్చాయి. మాస్ రాజా రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటించింది పాయల్. ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వెంకటేష్ నటించిన వెంకీమామ సినిమాలో చేసింది పాయల్. అయితే ఈ సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది. దాంతో పాయల్ కు ఆఫర్లు తగ్గాయి.

ఇటీవల డిజిటల్ పైన దృష్టి పెట్టింది ఈ బ్యూటీ. ఇప్పటికే ఓటీటీలో సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా ఆహా కోసం త్రి రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది పాయల్.. ఈ సినిమాలో తనదైన హాట్ నెస్ తో ఆకట్టుకుంది పాయల్. ఈ సిరీస్ తో పాయల్ కు హిట్ దక్కింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీ పైన ఫోకస్ చేయాలనీ చూస్తుంది. ధనంజయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జయరాజ్ బయోపిక్ `హెడ్ బుష్`లో పాయల్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాలో క్యాబరే డ్యాన్సర్ గా కనిపించనుంది పాయల్. ఈ సినిమా సక్సెస్ అయితే పాయల్ కు కన్నడలో ఆఫర్లు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ బోల్డ్ బ్యూటీ అక్కడ ఎలా సక్సెస్ అవుతుందో  చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bheemla Nayak: భీమ్లానాయక్ నుంచి నాలుగో సింగిల్.. ఆకట్టుకుంటున్న ‘అడవి తల్లి మాట’.. పాట

Anand Deverakonda: ఈ కుర్ర హీరో “హైవే” పై దూసుకెళ్లేనా.? హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న ఆనంద్ దేవరకొండ..

Pakka Commercial: మ్యాచో హీరో ఆశలన్నీ మారుతి సినిమా పైనే.. పక్కా కమర్షియల్.. పక్కా హిట్ కొట్టేనా..?