AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ.. దేశంలో మూడుకు చేరిన కేసుల సంఖ్య

భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదయ్యింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Omicron: భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ.. దేశంలో మూడుకు చేరిన కేసుల సంఖ్య
Omicron
Janardhan Veluru
|

Updated on: Dec 04, 2021 | 2:53 PM

Share

Omicron Varient: భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదయ్యింది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తిని క్వారంటైన్‌ చేశారు. రెండు రోజుల క్రితమే ఆ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి జామ్‌నగర్‌ వచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్‌టీ పీసీఆర్‌ టెస్ట్‌ల్లో కరోనా పాజిటివ్‌ రావడంతో శాంపిల్ప్‌ను పూణెలోని జీనోమ్‌ సీక్వెనింగ్‌కు పంపించారు. జీనోమ్‌ సీక్వెనింగ్‌లో ఆ వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్థారణ అయ్యింది. రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారణ అయ్యిందని గుజరాత్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది.

దీంతో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే బెంగళూర్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అయితే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి తిరిగి దుబాయ్‌ వెళ్లిపోయాడు.

దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి ఇప్పటి వరకు ఎవరూ మరణించకపోవడం ఊరట కలిగించే అంశం. ఒమిక్రాన్ కట్టడి చర్యల్లో భాగంగా పలు దేశాలు విదేశీయుల రాకను నిషేధించాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.

Also Read..

US-Indian Arrest: యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో ముగ్గురు భారతీయుల అరెస్ట్.. ఎందుకోసమంటే..?

BCCI: కొత్త పద్ధతిలో సీనియర్ మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీ.. ఈ టీమిండియా క్రికెటర్లపైనే స్పెషల్ ఫోకస్..!

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?