AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక న్యాయ బస్సు యాత్ర.. షురూ ఎప్పటి నుంచంటే..?

నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఏం చేసామో చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ప్రకటించారు.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో  సామాజిక న్యాయ బస్సు యాత్ర.. షురూ ఎప్పటి నుంచంటే..?
Ysrcp Bus Yatra
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Oct 13, 2023 | 3:26 PM

Share

నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఏం చేసామో చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ప్రకటించారు. తొలి విడత యాత్ర ఇచ్చాపురంలో అక్టోబర్ 26న మొదలై 13 రోజుల పాటు సాగుతుంది. ప్రతీ నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహిస్తామని బొత్స తెలిపారు. తొలి విడత బస్సు యాత్ర నవంబర్‌ 9న అనకాపల్లిలో ముగుస్తుంది. సామాజిక న్యాయ బస్సు యాత్ర పేరుతో ఈ బస్సు యాత్ర సాగుతుందని బొత్స తెలిపారు.

అక్టోబర్ 26 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్సీపీ సామాజిక బస్ యాత్ర ప్రారంభం కానుంది. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర ప్రాంత కీలక నేతల సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త వైవీ.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అమర్‌నాథ్, బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పల రాజు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన వైఎస్సార్సీపీ సామాజిక బస్ యాత్ర, సీఎం క్యాంప్ కార్యాలయం తరలింపు లాంటి కీలక అంశాలపై ఈ సమావేశం లో చర్చ జరిగింది.

విశాఖ ఎండాడలో నూతనంగా ప్రారంభమైన వైఎస్సార్సీపీ కార్యాలయం లో ఉత్తరాంధ్ర కీలక నేతల సమావేశం జరిగింది. సమావేశ వివరాలను మంత్రి బొత్స మీడియాకు వివరిస్తూ అక్టోబర్ 26న ఇచ్ఛాపురం నుంచి సామాజిక బస్ యాత్ర ప్రారంభం అవుతుంది. రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా మళ్లీ ఎందుకు అవసరమో వివరిస్తూ యాత్ర సాగుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదటి దశ లో 13 రోజుల పాటు బస్ యాత్ర సాగుతుందనీ వివరించారు.

అలాగే చంద్రబాబు ఆరోగ్యం, ముఖ్యమంత్రి కార్యాలయంపై వ్యాఖ్యలు, లోకేష్ – అమిత్ షా భేటీ, సీఎం కామెంట్స్‌పై జనసేన రియాక్షన్‌లపై స్పందించారు బొత్స. సీఎంఓ షిఫ్ట్టింగ్ కోసం కమిటీని నియమించామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి, ఎప్పుడు రావాలి ఆన్న అంశాలపై కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. చంద్రబాబుకు అవసరమైన వైద్యం అందిస్తామని, కోర్టు ఆదేశాలు, జైలు నిబంధనల మేరకు చంద్రబాబుకు వైద్యం అందుతుందన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు ఎవరిని కలవాలో నిర్ణయించుకోవడం వాళ్ళ ఇస్తామన్నారు. జన సేన ఎందుకు అంత గుంజుకుంటుందో తెలియడం లేదన్నారు బొత్స.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిర్మాణాలు పూర్తైన వెంటనే సీఎం విశాఖ వస్తారనీ, దొడ్డి దారిన విశాఖకు రావాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లేదన్నారు. అంతేకాదు గంటా శ్రీనివాస్ తన వియ్యంకుడి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే విశాఖ రాజధాని వద్దంటున్నారన్నారు సుబ్బా రెడ్డి. అన్ని స్థానాల్లో పోటీ చేసే కనీస నాయకత్వం లేని జన సేన గురుంచి మాట్లాడడం వృధా అన్నారు వైవీ సుబ్బారెడ్డి. కాగా, ముఖ్యమంత్రి కార్యాలయం షిఫ్టింగ్ నేఫథ్యంలో బస్ యాత్ర ద్వారా రాజదాని ఆవశ్యకతను మరోసారి వివరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us