YSRCP: దూసుకుపోతున్న సామాజిక సాధికార రథం.. సమన్యాయంపై నాయకుల స్వరం
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టింది వైసీపీ. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో సామాజిక సాధికార యాత్ర జరిగింది. ఈ సందర్భంగా.. నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. సమాజంలో గుర్తింపులేని ఎందరో బడుగు బలహీన వర్గాల నేతలకు వైసీపీ ప్రభుత్వంలో గుర్తింపు దక్కిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజా సంక్షేమంతోపాటు

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టింది వైసీపీ. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లిలో సామాజిక సాధికార యాత్ర జరిగింది. ఈ సందర్భంగా.. నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాల నాయుడు, రాజన్న దొర, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. సమాజంలో గుర్తింపులేని ఎందరో బడుగు బలహీన వర్గాల నేతలకు వైసీపీ ప్రభుత్వంలో గుర్తింపు దక్కిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రజా సంక్షేమంతోపాటు ప్రాంతాల అభివృద్ధి చేస్తున్న నాయకుడు.. సీఎం జగన్ అని చెప్పారు. కృష్ణా జిల్లా పామర్రులో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర కొనసాగింది. ఈ బస్సు యాత్రలో మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, కొలుసు పార్ధసారధితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం.. పామర్రు బహిరంగ సభలో ప్రసంగించారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ప్రజలా చంద్రబాబును నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి మేరుగు నాగార్జున. అందరూ ఐక్యంగా ఉండి సీఎంగా మళ్లీ జగన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా కావలిలో సామాజిక సాధికార బస్సు యాత్రలో రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్ది, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్ది, రాజ్యసభ సభ్యులు మస్తాన్‌రావు, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్ది పాల్గొన్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు రాజ్యసభ సభ్యులు మస్తాన్‌రావు. కేబినెట్‌లో 75 శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగలేదని గుర్తు చేశారు ఎంపీ మస్తాన్‌రావు. మొత్తంగా.. సామాజిక సాధికార బస్సుయాత్ర ద్వారా గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు వైసీపీ ప్రజా ప్రతినిధులు. ముఖ్యంగా.. టీడీపీ పాలనలో బడుగు బలహీనవర్గాలకు ఎలాంటి గుర్తింపు దక్కిందో.. సీఎం జగన్ పాలనలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందాయో బస్సు యాత్ర ద్వారా తెలియజేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








