AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో జగన్‌ పేరు ప్రస్తావన… సిట్‌ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు

ఏపీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్‌ కేసులో సిట్‌ ప్రైమరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో వైసీపీ అధినేత జగన్‌ పేరును ప్రస్తావించడం కాక రేపుతోంది. వరుస పరిణామాలతో లిక్కర్‌ కేసు ఏపీ పాలిటిక్స్‌లో మరింత హీట్‌ పెంచుతోంది...

AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో జగన్‌ పేరు ప్రస్తావన... సిట్‌ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌లో కీలక అంశాలు
Jagan Liquor Scam
K Sammaiah
|

Updated on: Jul 20, 2025 | 7:46 AM

Share

ఏపీ లిక్కర్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్‌ కేసులో సిట్‌ ప్రైమరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ప్రాథమిక ఛార్జ్‌షీట్‌లో వైసీపీ అధినేత జగన్‌ పేరును ప్రస్తావించడం కాక రేపుతోంది. వరుస పరిణామాలతో లిక్కర్‌ కేసు ఏపీ పాలిటిక్స్‌లో మరింత హీట్‌ పెంచుతోంది. ఒకవైపు ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌, మరోవైపు ప్రాథమిక ఛార్జ్‌షీట్‌ దాఖలు.. అందులో మాజీ సీఎం జగన్‌ పేరుండడం.. ఇలా ఏపీలో లిక్కర్‌ కేసులో ఒకే రోజు సంచలనాలు క్రియేట్‌ అయ్యాయి. లిక్కర్ కేసులో 305 పేజీలతో ప్రాథమిక ఛార్జ్‌షీట్‌‌ను దాఖలు చేసిన సిట్.. పలు కీలక అంశాలు పొందుపర్చింది. ప్రైమరీ ఛార్జ్‌షీట్‌లో జగన్‌ పేరు ప్రస్తావించింది. ఆయనకు తెలిసే లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని పేర్కొంది. కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. సైమన్‌ ప్రసన్‌, కొమ్మారెడ్డి అవినాష్, అనిల్‌రెడ్డి, సుజల్‌ బెహ్రన్‌, మోహన్‌, రాజీవ్‌, బొల్లారం శివ, ముప్పిడి అవినాష్ అనే 8మంది పేర్లను జత చేసింది. తాజా జాబితాతో లిక్కర్ కేసులోని నిందితుల సంఖ్య 48కి చేరింది.

ఈ కేసులో ఇప్పటికే 11మందిని అరెస్ట్ చేసిన సిట్.. వారిని అనేక సార్లు విచారించింది. వాళ్ల వాంగ్మూలాలు, రిమాండ్ రిపోర్టులు, వందకు పైగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను జత చేసి కోర్టుకు సమర్పించారు. 268మంది సాక్షులను విచారించి సేకరించిన సమాచారంతోపాటు 62 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు పేర్కొంది. మరో 20 రోజుల్లో రెండవ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే.. ఏపీ లిక్కర్‌ కేసులోని నిందితులంతా జగన్‌కు పరిచయస్తులేనని ప్రైమరీ ఛార్జ్‌షీట్‌లో సిట్‌ పేర్కొనడం ఆసక్తిగా మారింది.

మరోవైపు.. ఏపీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. లిక్కర్‌ కేసులో ఏ4గా ఉన్న మిథున్‌రెడ్డిని దాదాపు 6గంటలకు పైగా విచారించిన సిట్‌ అధికారులు.. నోటీసు ఇచ్చి అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో మిథున్‌రెడ్డిది కీలక పాత్ర పోషించినట్లు సిట్‌ భావిస్తోంది. లిక్కర్‌ అమ్మకాలను ఆన్‌లైన్‌ నుంచి మాన్యువల్‌కి మార్చడం వెనక మిథున్‌రెడ్డి పాత్ర ఉందంటోంది. లిక్కర్‌ లావాదేవీలను మిథున్‌రెడ్డి పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నట్టు ఆరోపించింది. సొంత బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెట్టి వసూళ్ల నెట్‌వర్క్‌లో మిథున్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారంటోంది సిట్‌. మిథున్‌రెడ్డి అరెస్ట్‌తో ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్‌ అయినవారి సంఖ్య 12కు చేరింది.

ఇదిలావుంటే.. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షతో పెట్టిన కేసే అన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవని గుర్తు చేశారు. తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతుందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు మిథున్‌రెడ్డి. బైట్‌… పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైసీపీ ఎంపీ