Andhra Pradesh: ‘వివేకానంద రెడ్డిని చంపమని నాకు చెప్పారు’.. దస్తగిరి స్టేట్‌మెంట్‌లో సంచలనాత్మక వివరాలు..
Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం వివేకానంద రెడ్డి రెండో భార్య షేక్ షమీమ్ ఆయన హత్యపై తొలి సారిగా స్పందించారు. తాజాగా ఈ కేసులో అప్రూవర్‌గా..
Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం వివేకానంద రెడ్డి రెండో భార్య షేక్ షమీమ్ ఆయన హత్యపై తొలి సారిగా స్పందించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గతంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ స్టేట్‌మెంట్‌ను దస్తగిరి అప్రూవర్‌గా మారక ముందు సీబీఐకి ఇచ్చాడు. తన స్టేట్‌మెంట్‌లో దస్తగిరి పలు కీలక విషయాలను బయటపెట్టాడు. తనకు 2016 నుంచే మాజీ మంత్రి వివేకానందారెడ్డితో పరిచయం ఉందన్న దస్తగిరి.. 2017 ఫిబ్రవరి నుంచి 2018 డిసెంబర్ వరకు వివేకాకు డ్రైవర్‌గా పనిచేశానన్నాడు.
అలాగే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపాలైన ఆయన తనను దారుణంగా తిట్టాడని దస్తగిరి ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. అనంతరం కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, అతని కుమారుడు ప్రసాదమూర్తి మధ్య భూవివాదం గురించి 2017 నుంచి 2018 వరకు బెంగళూరులో సెటిల్మెంట్ కోసం తిరిగామని, ఆ ల్యాండ్ సెటిల్‌మెంట్ తర్వాత వివేకాకు రూ.8 కోట్లు వస్తాయని తమకు తెలుసని దస్తగిరి తెలిపాడు. అలాగే 2018లో వివేకానంద రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి బెంగళూరు వెళ్లారని దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో వివరించాడు.
అయితే ఆ సమయంలో వివేకా, గంగిరెడ్డి మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగిందని, ల్యాండ్ సెటిల్ చేసినందుకు 50% డబ్బు గంగిరెడ్డి అడిగారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు వివేకారెడ్డి ‘నన్నే వాటా అడిగేంత పెద్డొడివి అయ్యావా..?’ అంటూ గంగిరెడ్డిని ప్రశ్నించారని, ఆ రోజు నుంచి వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని దస్తగిరి తన స్టేట్‌మెంట్ ద్వారా తెలియజేశాడు. ఈ క్రమంలోనే 2019 ఫిబ్రవరిలో ఎర్ర గంగిరెడ్డి తనను పులివెందులకు పిలిపించి, వివేకానంద రెడ్డిని చంపాలని ఆయన చెప్పారని దస్తగిరి తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..