Andhra Pradesh: గెలపు కోసం చంపేయాలని ప్రయత్నించలేదా? ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
Andhra Pradesh: టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాయలసీమలో..
Andhra Pradesh: టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబుపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాయలసీమలో సీట్ల కోసం రక్తపాతం సృష్టించి ఫ్యాక్షన్ ఉన్మాదిగా మారాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రకాశ్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆయన మాటలు యధావిధంగా.. ‘‘చంద్రబాబు వాగుడే వాగుడు కార్యక్రమం రాయలసీమలో చేపట్టారు. ఆయన సీమకు ఏమిచేసాడో చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. రాయలసీమలో సీట్ల కోసం రక్తపాతం సృష్టించి ఫ్యాక్షన్ ఉన్మాదిగా మారారు. వర్గాలను పెంచి పోషిస్తే నాలుగు ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. 2014-19 మధ్యలో ఎన్ని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు? ఇప్పుడేన్ని కేసులున్నాయి చూడండి. గతంలో నన్ను చంపాలని దాడి చేస్తే.. మీ అధికారులు రివర్స్‌గా నాపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా? మా కుటుంబంలో ఒకర్ని చంపేస్తే కానీ గెలవలేమని మీరు ప్రయత్నం చేయలేదా? మీ ఎమ్మెల్యే కూడా త్వరలో పోతాడు అని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.’’ అని ఫైర్ అయ్యారు.
ఒక రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యామ్ కి నీళ్ళు ఇచ్చిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది అని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. సీమలో రక్తం పారించిన చరిత్ర టీడీపీది అని అన్నారు. తమ నియోజకవర్గంలో తల్లి కొడుకులు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించామన్నారు. ఎన్నికల వరకే పార్టీలు, నియోజకవర్గ అభివృద్ధిలో అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చిన ఘనత తమకు చెందుతుందన్నారు.
‘‘మీరు స్కాములు చేయాలని భావించిన ఫ్యాక్టరీలను సైతం మేము ముందుకు తీసుకొచ్చాం. ఆ రోజు వాళ్లు ఎందుకు ముందుకు రాలేదు? వాళ్లని డబ్బులు అడిగావా? రాష్ట్రాన్ని దివాలా తీయించి వెళ్లిపోయావ్.. కాగ్ నువ్వు చేసిన దాన్ని తన నివేదికలో స్పష్టం చేసింది. ఇది చాలదా? నువ్వు ఒక ఆర్థిక ఉన్నాది అనడానికి. అమరావతి పేరుతో మిగిలిన జిల్లాలు బాగుపడకూడదు అని భావించింది నువ్వు కాదా? పేదలకు అమరావతిలో ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకోని నువ్వు సామాజిక ఉన్మాదివి. మీ పరిటాల సిద్ధార్థ్ ఆయుద్ధాలతో దొరికిన విషయం మర్చిపోయవా? వాళ్లని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావ్ అంటే నీ ప్రమేయం కూడా ఉందా? చంద్రబాబు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? మూడేళ్లు మా వాళ్లను కట్టడి చేసుకుంటూ వచ్చా. అందుకే మీ వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాప్తాడుపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. గత మూడు నెలల్లో 7 హత్య కేసులు నమోదైతే.. చేసిందంతా టీడీపీ వాళ్లే. హత్యకు గురైంది వైసీపీ నాయకులు. ఫ్యాక్షన్ లేకుండా ఉండాలని ఆ రెండు కుటుంబాలకు సంబంధం లేకుండా వైఎస్సార్ నాకు టికెట్ ఇచ్చారు. కానీ టీడీపీ ఫ్యాక్షన్ వైపే వాళ్ళ కార్యకర్తలను ట్యూన్ చేస్తున్నారు. నీతో ప్రజలు లేరు.. నీరు చెట్టు నిదులు తినేవాళ్లు నీ వెంట ఉన్నారు. అధికారం లేకపోతే బతకలేను అనేలా ప్రవర్తించవద్దు. దత్తపుత్రుడిని పంపారు.. కౌలు రైతులను పరామర్శ అంటూ పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. మీరంతా కలిసిన జగన్ చేసిన మంచిని ఎదుర్కోలేరు. ఒక ఎమ్మెల్యేనీ చంపుతాను అని చంద్రబాబు చేసిన వాఖ్యలను ప్రజలే నిర్ణయించుకోండి.’’ అంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నిప్పులు చెరిగారు.