Palm Oil Ban Lift: గుడ్ న్యూస్ చెప్పిన ఇండోనేషియా.. భారత్‌కు భారీ ఊరట.. ఆ రేట్లు దిగివచ్చేనా!?

Palm Oil Ban Lift: పామాయిల్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా. వంట నూనెల ధరలు పెరిగిపోయిన దశలో

Palm Oil Ban Lift: గుడ్ న్యూస్ చెప్పిన ఇండోనేషియా.. భారత్‌కు భారీ ఊరట.. ఆ రేట్లు దిగివచ్చేనా!?
Palm Oil
Follow us
Shiva Prajapati

|

Updated on: May 20, 2022 | 7:02 AM

Palm Oil Ban Lift: పామాయిల్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా. వంట నూనెల ధరలు పెరిగిపోయిన దశలో ఈ నిర్ణయం భారత్‌కు ఊరట కలిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ సరఫరాదారు ఇండోనేషియా. గత ఏప్రిల్‌ నెల 28వ తేదీ నుంచి ఆ దేశం పామాయిల్‌ ఎగుమతులను నిలిపివేయడం అంతర్జాతీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తమ దేశంలో పామాయిల్‌ సప్లయ్‌ పెరగడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇండోనేషియా రైతులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడ పామాయిల్‌ పరిశ్రమపై కోటి 70 లక్షల మంది వర్కర్లు ఆధారపడి జీవిస్తున్నారు. దీంతో తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది ఇండోనేషియా. నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 23నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం అవుతాయి.

ఇండోనేషియా పామాయిల్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తేయడం భారత్‌కు ఊరట కలిగిస్తోంది. మన దేశం ఇండోనేషియా నుంచి 3 లక్షల టన్నుల మేర పామాయిల్‌ దిగుమతి చేసుకునేది. అక్కడి నుంచి సరఫరా ఆగిపోవడంతో మలేసియా, థాయ్‌లాండ్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా భారత్‌కు సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ సరఫరా తగ్గడంతో పామాయిల్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగిపోయాయి.. ఇండోనేషియా పామాయిల్‌ ఎగుమతులను తిరిగి ప్రారంభించడంతో వంట నూనెల ధరలు తిరిగి అదుపులోకి వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో మన దేశంతో వంట నూనెల వాడకం కాస్త తగ్గినా, వచ్చే నెల నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది.