Afghanistan: వార్తలు చదివే యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే.. ఆ దేశంలో పీక్స్ కు చేరిన ఆంక్షలు

అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు(Talibans) పాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే తమ దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలు విధించిన....

Afghanistan: వార్తలు చదివే యాంకర్లూ ముఖాలు కప్పుకోవాల్సిందే.. ఆ దేశంలో పీక్స్ కు చేరిన ఆంక్షలు
Afghanistan
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 20, 2022 | 6:36 AM

అఫ్గానిస్థాన్ లో తాలిబన్లు(Talibans) పాలన చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే తమ దేశంలోని మహిళలకు చదువు, దుస్తులు వంటి అనేక విషయాలపై రకరకాల ఆంక్షలు విధించిన తాలిబన్లు.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన తాలిబన్ల హామీలు నీటిమూటగా మారాయి. తాజాగా టీవీ యాంకర్లపైనా తాలిబన్లు ఆంక్షలు విధించారు. వార్తల ప్రసార సమయాల్లో మహిళా టీవీ యాంకర్లు తమ ముఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. తాలిబన్లు ఇచ్చిన ఆదేశాలకు ఎదురుచెప్పే పరిస్థితి కానీ, వాటిపై బహిరంగంగా చర్చించే పరిస్థితి గానీ లేదని అఫ్గాన్‌కు చెందిన ఒక వార్తా సంస్థ అభిప్రాయపడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహిళా యాంకర్లు ముఖాలకు మాస్కులు ధరించి ప్రసారాలను కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కొందరు యాంకర్లు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.

గతంలోనూ తాలిబన్లు ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అఫ్గాన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. గతేడాది ఆగస్టులో అఫ్గాన్ ప్రభుత్వం పతనమై తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గానిస్థాన్ లో మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పోరాటాలు ముగిసినప్పటికీ, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

గతంలోనూ బాలికలను ఆరో తరగతి తరవాత హైస్కూళ్లకు పంపకూడదనే నిషేధాన్ని ఎత్తివేస్తామని చేసిన వాగ్దానాన్ని సైతం తాలిబన్‌ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇప్పుడు కొత్తగా విమానాల్లోకీ అనుమతించేది లేదంటోంది. వీరి నిర్వాకాలు అంతర్జాతీయ సమాజానికే కాదు. స్థానికులకూ ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బాలికలను హైస్కూళ్లకు వెళ్లనివ్వాలని కోరుతూ కాబుల్‌లో ప్రదర్శనలు జరిగాయి. వీటిలో బాలికలే ఎక్కువగా పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్‌ నిరుపేద దేశమనీ అక్కడి ప్రజలకు విజ్ఞానం అందకుండా చేస్తే వారి భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read

Mahesh Babu: మనసులోని మాటలను బయటపెట్టిన మహేష్ బాబు.. ఆ సినిమాను రీక్రియేట్ చేయాలనుందంటూ..

Cash Withdrawal: గూగుల్‌ పే, పేటీఎంతో ఏటీఎమ్‌ నుంచి మనీ విత్‌ డ్రా.. పూర్తి ప్రాసెస్‌ తెలుసుకోండి..!

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ