AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Delhi Tour: నేడు సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం.. రైతు ఉద్యమంలో అసువులుబాసిన కుటుంబాలకు పరామర్శ

ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు.

CM KCR Delhi Tour: నేడు సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనకు శ్రీకారం.. రైతు ఉద్యమంలో అసువులుబాసిన కుటుంబాలకు పరామర్శ
Cm Kcr
Surya Kala
|

Updated on: May 20, 2022 | 6:51 AM

Share

జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకుచెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సీఎం పరామర్శించనున్నారు.

సిఎం కెసిఆర్ గారి పర్యటన వివరాలు : ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసిఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సీఎం కేసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారు.

మే 22 వ తేదీన మధ్యాహ్నం.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీనుంచి చంఢీఘర్ పర్యటన చేపడతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసిఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ లతో కలిసి సీఎం కేసిఆర్ చేపడతారు. సంచలనం సృష్టించిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన.. పంజాబ్, హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతుల కుటుంబాలకు చెక్కులను అందచేస్తారు.

ఇవి కూడా చదవండి

26 మే ఉదయం… సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాజీ భారత ప్రధాని దేవగౌడ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమౌతారు. బెంగుళూరు నుంచి మే 27 తేదీన రాలేగావ్ సిద్ది పర్యటనను చేపట్టనున్నారు. అక్కడ ప్రముఖ సమాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసిఆర్ భేటీ అవుతారు. అటునుంచి సాయిబాబా దర్శనం కోసం సీఎం కేసిఆర్ షిరిడీ వెళతారు. అక్కడనుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు సీఎం కేసిఆర్ చేరుకుంటారు.

అటు తర్వాత మే 29 లేదా 30 న బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనకు సీఎం కేసిఆర్ సంసిద్దం కానున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసిఆర్ ఆదుకోనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..