Telangana: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. ఏయే బ్రాండ్లపై ఎంత రేటు పెరిగిందో తెలుసుకోండి

తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు మే 19 నుంచి అమల్లోకి వస్తాయని అబ్కారీ శాఖ తెలిపింది. పెరిగిన ధరల వివరాలు దిగువన తెలుసుకోండి

Telangana: తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. ఏయే బ్రాండ్లపై ఎంత రేటు పెరిగిందో తెలుసుకోండి
Liquor
Follow us

|

Updated on: May 19, 2022 | 7:53 PM

తెలంగాణ సర్కార్ మందుబాబులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. లిక్కర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  పెరిగిన ధరలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా మద్యం ధరలు ఎంత పెరిగాయన్న దానిపై చాలామందికి స్పష్టత లేదు. తాజాగా పెరిగిన రేట్లపై క్లారిటీ ఇచ్చింది అబ్కారీ శాఖ. మద్యంపై దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ఒక్కో బీరుపై రూ.10, క్వార్టర్‌ లిక్కర్‌ బాటిల్‌పై రూ.20, వెయ్యి ఎంఎల్‌ల లిక్కర్‌పై రూ.120 వరకు రేటు పెరిగింది. అయితే, ఆయా బ్రాండ్‌లను బట్టి ధరల్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. 2021-23 మద్యం విధానం అమల్లోకి వచ్చాక ధరలు పెంచడం ఇదే ప్రథమం. మద్యం బాటిళ్లపై పాత ఎమ్మార్పీ రేట్లు ఉన్నప్పటికీ.. వాటికి కూడా పెరిగిన కొత్త ధరలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. 200 లోపు MRP ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్‌పై రూ.20, 375 ఎంఎల్‌పై రూ.40, 750 ఎంఎల్‌పై రూ.80 లెక్కన పెంచారు. అదే లెక్కన రెండు వందల కంటే ఎక్కువ MRP ఉన్న బ్రాండ్లపై 180 ఎంఎల్‌పై రూ.40, 375 ఎంఎల్‌పై రూ.80, 750 ఎంఎల్‌పై రూ.160 చొప్పున పెంచినట్లు అధికారులు వెల్లడించారు. వైన్‌ బ్రాండ్‌ MRPపై క్వార్టర్‌, హాఫ్‌, ఫుల్‌ బాటిల్స్‌పై రూ.10, రూ.20, రూ.40 లెక్కన పెంచారు. అన్ని రకాల బీరు బ్రాండ్ల బాటిల్‌ MRPలపై రూ.10లు పెంచినట్లు పేర్కొన్నారు. MRPకి సంబధించి ఎవరైనా లిమిట్స్ క్రాస్ చేస్తే జరిగితే కఠిన చర్యలు తప్పవని అబ్కారీ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే 1800 425 2523 నంబర్‌కి కాల్‌ చేసి కంప్లైంట్ చేయొచ్చని చెప్పారు.

లిక్కర్ ఏయే బ్రాండ్లపై ఎంత పెరిగిందో ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి

బీర్లు- ఏ బ్రాండ్‌పై ఎంత పెరిగిందంటే..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!