Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
తెలంగాణలో ఆరుగురు అధికారులను బదిలీ చేయడంతోపాటు.. అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
IAS officers transferred in Telangana : తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు అధికారులను బదిలీ చేయడంతోపాటు.. అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమించింది. రవాణాశాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, రిజిస్ట్రేషన్ – స్టాంపుల కమిషనర్‌గా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేసింది. ఔషధ నియంత్రణ సంచాలకులుగా సయ్యద్ అలీ ముర్తజ రీజ్వికి అదనపు బాధ్యతలు, జీడీఏ కార్యదర్శిగా వీ శేషాద్రికి అదనపు బాధ్యతలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.