Monkeypox: అలా కలిసే వారికే ఎక్కువ ముప్పు.. మంకీపాక్స్ వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా..?

యూకే, కెనడా, నైజీరియా, స్పెయిన్, పోర్చుగల్ లో పదుల కొద్ది మంకీపాక్స్‌ కేసులు బయట పడ్డాయి. అయితే.. ఈ మంకీపాక్స్‌ వైరస్‌ అనేది తీవ్రమైనదిగా గుర్తించారు నిపుణులు.

Monkeypox: అలా కలిసే వారికే ఎక్కువ ముప్పు.. మంకీపాక్స్ వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా..?
Monkeypox
Follow us

|

Updated on: May 19, 2022 | 8:16 PM

Monkeypox Virus: కరోనా పీడ పోకముందే.. మరో కొత్త వైరస్‌ కలకలం రేపుతోంది. పలు దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు వెలుగులోకి వస్తుండటం ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా అమెరికాలో తొలి కేసు నమోదు కావడంతో భయాందోళన మరింత పెరిగింది. ఈ వైరస్ ఎలుకల నుంచి సోకిన జీవుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యూకే, కెనడా, నైజీరియా, స్పెయిన్, పోర్చుగల్ లో పదుల కొద్ది మంకీపాక్స్‌ కేసులు బయట పడ్డాయి. అయితే.. ఈ మంకీపాక్స్‌ వైరస్‌ అనేది తీవ్రమైనదిగా గుర్తించారు నిపుణులు. దీని తీవ్రత వల్ల జ్వరం, అనారోగ్యం, సాధారణ ఫ్లూ లాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాగే కణాల వాపుతో మొదలై ముఖం, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. దీని ఇన్ఫెక్షన్‌ 2 నుంచి 4 వారాల వరకు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల, లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఇది వ్యాధి వ్యాప్తి చెందుతుందని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే కలుషితమైన దుస్తులు, గాలి బిందువుల ద్వారా సంక్రమించే అవకాశముంది. అయితే.. తాజాగా అమెరికా నిపుణుల అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వలింగ సంపర్కుల్లోనే (Sexual Transmission) ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయని అమెరికన్ సీడీసీ, డబ్య్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తంచేశాయి.

  • ఉత్తర అమెరికా, యూరప్‌లోని ఆరోగ్య అధికారులు మే ప్రారంభం నుంచి డజన్ల కొద్దీ మంకీపాక్స్ కేసులను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇది బహుశా లైంగిక సంక్రమణ ద్వారా వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. గుర్తించిన కేసులు లైంగిక చర్య ద్వారా జరిగినట్లు పేర్కొంటున్నారు.
  • UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఇటీవలి కేసులు ప్రధానంగా స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు లేదా పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ వారం ప్రారంభంలో కొత్త వైరస్ వ్యాప్తిపై UK, యూరోపియన్ ఆరోగ్య అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులుగా గుర్తించే వ్యక్తులలో అనేక కేసులు నమోదయ్యాయని కూడా పేర్కొంది. పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో ఈ వైరస్ సంక్రమించడాన్ని చూశామని WHO అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోస్ ఫాల్ అన్నారు.
  • చాలా మంది ప్రజలు ఈ వైరస్ నుంచి కొన్ని వారాల్లోనే కోలుకుంటున్నారు. అయితే.. ఈ వ్యాధి కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రాణాంతకంగా మారింది. ఇటీవలి సంవత్సరాలలో మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో వేలాది మందికి సోకింది. అయితే ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలో ఇది చాలా అరుదుగా సంక్రమించినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.
  • మంకీపాక్స్ తరచుగా జ్వరం, కండరాల నొప్పి, కండరాల వాపు, ఫ్లూ-వంటి లక్షణాలతో మొదలవుతుంది. ముఖం, శరీరంపై చికెన్‌పాక్స్ లాంటి దద్దుర్లు ఏర్పడతాయి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..