Minister Vidadala Rajini: మానవత్వం చాటుకున్న మంత్రి విడదల రజిని.. దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి..

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడినవారికి దైర్యం చెప్పడంతోపాటు.. దగ్గరుండి ఆస్పత్రికి..

Minister Vidadala Rajini: మానవత్వం చాటుకున్న మంత్రి విడదల రజిని.. దగ్గరుండి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి..
Minister Vidadala Rajini
Follow us
Sanjay Kasula

|

Updated on: May 19, 2022 | 6:29 PM

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో గాయపడినవారికి దైర్యం చెప్పడంతోపాటు.. దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీకొనడంతో.. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం రెయిన్ ట్రీ పార్కు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. మంత్రి తన కాన్వాయ్ ను అక్కడే ఆపి.. గాయపడినవారిని ఆస్పత్రికి తరించేవరకు కూడా అక్కడే ఉన్నారు.

అయితే గురువారం ఉదయం ఓ రివ్యూ మీటింగ్ కోసం సెక్రెటేరియట్‌కు వెళ్తున్న మంత్రి విడదల రజిని.. ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. అంబులెన్స్‌ వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు.

Minister Vidadala Rajini He

Minister Vidadala Rajini

తన వ్యక్తిగత సిబ్బందితో బాధితులను గుంటూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూప‌రింటెండెంట్‌ను మంత్రి విడదల రజిని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి
Vidadala Rajini

Minister Vidadala Rajini

మంత్రి స్వయంగా రంగంలోకి దిగడంతో అధికారులు వెంటనే రియాక్డ్ అయ్యారు.