AP: రక్షకుడు కాదు భక్షకుడు.. అర్థరాత్రి తనకు బిర్యానీ పెట్టలేదని..
ఏఎస్సై హద్దు మీరాడు. తనేదో పైనుంచి దిగొచ్చినట్లు బిల్డప్ ఇచ్చాడు. అర్థరాత్రి హోటల్ వాళ్లు తనకు బిర్యానీ పెట్టలేదని రెచ్చిపోయాడు.
అతనో ఏఎస్సై. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. ఎవరైనా అతి చేస్తే తీసుకెళ్లి సెల్‌లో పడేయాలి. కానీ ఆయనే ట్రాక్ తప్పాడు. వీధిరౌడీ కంటే హీనంగా ప్రవర్తించాడు. పోలీస్ అంటే ప్రజల సేవకుడు అన్నట్లు కాకుండా.. ప్రజలను పాలించే రూలర్‌లా ఫీలయ్యాడు. భోజనం అయిపోయిందని చెప్పినందున హోటల్ సిబ్బందిపై దాడికి దిగాడు. బండ బూతులు తిడుతూ బూటు కాలితో ఇష్టానుసారంగా తన్నాడు. ఈ ఏఎస్సై రౌడీయిజం శ్రీసత్యసాయి జిల్లా(Sri Sathya Sai district)లో జరిగింది. ఆ ఏఎస్సై పేరు ఉజైతుల్లా. పనిచేసేది నల్లమాడ(Nallamada) పోలీస్ స్టేషన్. టైమ్ కాని టైమ్‌లో అర్ధరాత్రి బిర్యానీ కోసం ఓ హోటల్‌కి వచ్చిన ఏఎస్సై ఉజైతుల్లా, అక్కడి సిబ్బందిపై వీరంగం ఆడాడు. బిర్యానీ అయిపోయిందని చెప్పిన సర్వర్‌పై బూతులు తిడుతూ విరుచుకుపడ్డాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఏఎస్సై ఉజైతుల్లా వీరంగంపై జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కి కంప్లైంట్ చేశాడు బాధితుడు నాయుడు. బూతులు తిడుతూ తనపై విచక్షణారహితంగా దాడి చేసిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరాడు.