NTR District: అడవి బాట పట్టిన ఆ గ్రామం.. చెట్టు, పుట్టా సెర్చింగ్.. ఎందుకోసమంటే
ఎన్.టీ.ఆర్ జిల్లాలో వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అడవిలోకి వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో గ్రామస్థులు, పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
AP News: ఎన్.టీ.ఆర్ జిల్లాలో వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ చర్చనీయాంశమైంది. జి.కొండూరు మండలం(G Konduru Mandal) దుగ్గిరాలపాడు(Duggiralapadu)కు చెందిన బేదం వసంతరావు రెండు రోజుల క్రితం కట్టెల కోసం జి.కొండూరు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లాడు. కానీ ఎంత సమయం గడిచినా తిరిగి ఇంటికి రాలేదు. అతడిని గాలించిన కుటుంబ సభ్యులు… రెండు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో జి కొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అడవిలో గ్రామస్తులతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వసంతరావు అదృశ్యంలో.. అతని కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు నెలకున్నాయి. వన్యప్రాణులు అతడిపై దాడి చేసే ప్రమాదం లేకపోలేదని స్థానికులు చెబుతున్నారు. అటు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సాయం కూడా తీసుకుంటున్నారు పోలీసులు. త్వరలో టెక్నాలజీ సాయంతో గాలింపు చేపడతామని.. అడవిలో ఉంటే మాత్రం ఆచూకి తప్పకుండా తెలుస్తుందంటున్నారు. మరోవైపు ఆయన వేరే ఎక్కడికైనా చెప్పకుండా వెళ్లారా.. ఇంట్లో వాళ్లతో ఏమైనా గొడవలు అయ్యాయా అనే వివరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.