PM Modi Japan Tour: ఈ నెల 24న జపాన్‌కు పయనం కానున్న ప్రధాని మోడీ.. క్వాడ్ నేతలతో సమావేశం

భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల మధ్య క్వాడ్ సమావేశం జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ ఈ నెల 24న జపాన్ కు పయణంకానున్నారు.

PM Modi Japan Tour: ఈ నెల 24న జపాన్‌కు పయనం కానున్న ప్రధాని మోడీ.. క్వాడ్ నేతలతో సమావేశం
Pm Modi Tokyo Tour
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2022 | 8:44 AM

PM Modi Japan Tour: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 24న జపాన్(Japan) రాజధాని టోక్యోలో(Tokyo) జరిగే క్వాడ్ సమ్మిట్‌కు (Quad summit)హాజరుకానున్నారు. క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోడీ పాల్గొంటారని ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ కౌంటర్ ఫ్యుమియో కిషిదతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా నాలుగు దేశాల మధ్య సహకారాన్ని మరిన్ని రంగాలకు విస్తరించే అంశంపై ఆయా దేశాల అధ్యక్షులతో సమాలోచనలు జరపనున్నారు.

“ఈ పర్యటనలో, ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వ్యాపారవేత్తలతో ఒక వ్యాపార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన జపాన్‌లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి ఆస్ట్రేలియా ప్రధానితో కూడా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది” అని MEA విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ మే 21న జాతీయ ఎన్నికలను ఎదుర్కోనున్నారు. “తాము క్వాడ్‌కు చాలా ప్రాముఖ్యతనిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు. మేము సమకాలీన అంశాలు , ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాము, ”అని ఆయన అన్నారు.

ఈ టోక్యో సమావేశం.. క్వాడ్ నేతల మధ్య జరిగే నాలుగో భేటీ కానుంది. గత ఏడాది మార్చిలో నాలుగు దేశాల అధ్యక్షులు  తొలిసారి వర్చువల్​గా సమావేశమయ్యారు.  సెప్టెంబర్​లో వాషింగ్టన్​లో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. ఇక 2022 మార్చిలో మూడోసారి నాలుగు దేశాల అధినేతలు వర్చువల్​గా సమావేశమై చర్చలు జరిపారు. ఇప్పుడు జరిగే జపాన్ లోని సమావేశం నాలుగు భేటీ కానున్నది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..