Omicron Variant BA.4: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 అలజడి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..

దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కి రాగా.. అతడికి ఈ సబ్ వేరియంట్ సోకినట్టు తెలుస్తోంది.

Omicron Variant BA.4: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 అలజడి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..
Omicron Variant
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2022 | 8:26 AM

Omicron Variant BA.4: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఈ క్రమంలో వెలుగులోకి వస్తున్న కరోనా వేరియంట్లు అలజడి రేపుతున్నాయి. దక్షిణాఫ్రికా, యూరప్ దేశాల్లో కోవిడ్‌ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఏ.4… భారత్‌లోనూ వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్‌ తొలికేసు ఈనెల 9న హైదరాబాద్‌లో నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ మేరకు ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌) గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికాకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కి రాగా.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జరిపిన వైద్య పరీక్షల్లో అతడికి ఈ సబ్ వేరియంట్ సోకినట్టు తెలుస్తోంది. అయితే.. పెద్దగా లక్షణాలు కనిపించలేదని సమాచారం..

దక్షిణాఫ్రికాలో ఫిప్త్ వేవ్‌కు ఇదే కారణం..

అమెరికా, దక్షిణాఫ్రికాలో కరోనా ఉద్ధృతికి కారణమైన రెండు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లలో ‘బీఏ.4’ కూడా ఒకటి. కాగా.. జనవరి నుంచి ఓమిక్రాన్ వెరియంట్లు BA4, BA5 వేరియంట్‌లు దక్షిణాఫ్రికాలో విజృంభించాయి. ఫిప్త్ వేవ్‌కు ఇవే కారణమని అధికారులు తెలిపారు. ఆ తర్వాత అమెరికా, ఐరోపాలో కూడా కేసులు పెరిగాయి. కాగా.. Omicron BA4 వేరియంట్ భారతదేశంలో నమోదుకావడం ఇదే మొదటిసారి. రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కంటే ఇది ప్రమాదకరం కాదనీ, కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక విభాగం చీఫ్‌ మారియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్ ఒకసారి వ్యాపించడం, వ్యాక్సినేషన్ ను విస్తృతంగా చేపట్టడం వల్ల… బీఏ.4 ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..