Big Family: దేశానికే ఆదర్శం ఈ పెద్ద ఫ్యామిలీ.. ఉమ్మడిగా 62 మంది కుటుంబ సభ్యులు.. ఎకరం భూమిలో ఇల్లు.. ఒకే కిచెన్ లో వంట..
మనదేశానికే ఆదర్శం ఈ కుటుంబం.. భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని ఇంకా కొనసాగిస్తూ.. ఏకంగా నాలుగు తరాలవారు (Four Generations) కలిసి జీవిస్తున్నారు. 62 మంది సభ్యులతో కూడిన ఈ కుటుంబం ఐక్యతకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ భారీ కుటుంబం బీహార్‌లోని గయా జిల్లాలో ఉంది.
Big Family In India: మారుతున్న కాలంతో పాటు బంధాలు, బంధుత్వాలు మారిపోతున్నారు. మేము మనది నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకుంటున్నారు. భారతీయ సంప్రదాయానికి(Bharath Tradition) పట్టుగొమ్మలు ఉమ్మడి కుటుంబాలు (Joint Families). అయితే ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక కారణాలతో ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి. అయితే తాము అందరికంటే భిన్నం అంటున్నారు ఈ కుటుంబ సభ్యులు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు తరాలవారు (Four Generations) కలిసి జీవిస్తున్నారు. 62 మంది సభ్యులతో కూడిన ఈ కుటుంబం ఐక్యతకు ఉదాహరణగా నిలుస్తోంది. ఈ భారీ కుటుంబం బీహార్‌లోని గయా జిల్లాలో ఉంది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్‌లోని గయా జిల్లాలో కళ్యాణ్ కుటుంబం గత కొన్నేళ్లుగా ఉమ్మడి కుటుబంగానే జీవిస్తోంది. ఏకంగా 62మంది కుటుంబ సభ్యులు కలిసి జీవిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ నాలుగు తరాలు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అందరి ఆహారాన్ని ఒకే వంటగదిలో తయారు చేసి అందరూ కలిసి తింటారు.
బోధ్‌గయలో సామాజిక సేవకు ఉదాహరణగా నిలిచిన ‘కళ్యాణ్ కుటుంబం’ ఇతరులకు అనేక విషయాల్లో స్ఫూర్తిగా నిలిస్తోంది. సాధారణంగా ఇంట్లో నలుగురు, ఐదుగురు సభ్యులుంటేనే.. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో కుటుంబ కలహాలతో నిండిపోతుంది. అయితే ఈ ‘కళ్యాణ్ కుటుంబ’ సభ్యుల సంఘీభావం నుండి ఇతరులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘కళ్యాణ్ కుటుంబ పెద్ద కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి దంపతులు. కుటుంబం మొత్తాన్ని ఐక్యంగా ఉంచడంలో కృష్ణ కన్నయ్య ప్రసాద్ అతని భార్య రాధికా దేవిలు ప్రముఖ పాత్రను పోషిస్తారు. కళ్యాణ్ కుటుంబంలో మొత్తం సభ్యుల సంఖ్య 62. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో ఇల్లు ఉంది. ఆ ఇంటిని ‘కళ్యాణ్ పరివార్ కాంప్లెక్స్’ అని అంటారు. ఇంట్లో 57 గదులుంటాయి. దాదాపు అందరికీ ప్రత్యేక రూమ్‌లు ఉన్నాయి. ఇంత మందికి కలిపి ఒకే కిచెన్ ఉంటుంది. అందరూ ఒకేసారి భోజనం చేస్తారు.
ఉమ్మడి కుటుంబం:
తొమ్మిది మంది అన్నదమ్ముల్లో పెద్దవాడైన అజయ్‌సింగ్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కుటుంబమంతా ఐక్యంగా ఉండేందుకు మా మేనమామ దివంగత రామ్‌లఖాన్ సింగ్, అత్త గంగాదేవి పాత్ర కీలకమైందని చెప్పారు. వారి మరణం తర్వాత ఇప్పుడు కుటుంబం మొత్తం పగ్గాలు తమ తల్లిదండ్రులు కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి కుటుంబాన్ని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. మామలాగే నాన్న కూడా ఉమ్మడి కుటుంబాన్ని నమ్ముతాడు. అందుకే ఇప్పటి వరకు ఇంటి విభజన జరగలేదని చెప్పారు.
స్వచ్చంద సేవలు:
ఉమ్మడి కుటుంబంలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది సోదరులకు కూడా స్వంత వ్యాపారాలున్నాయి. ఇక NGOల ద్వారా ఆ ప్రాంతంలోని పేదలు, నిస్సహాయులు, నిరుపేదలకు సేవ చేయడం కోసం బోధ్‌గయాలో కళ్యాణ్ పరివార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం, స్వావలంబన తదితర సేవలను ఐదు వేర్వేరు స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు అందిస్తున్నారు. అంతేకాదు హోటళ్లు, హార్డ్‌వేర్, శానిటరీ వస్తువులు, టైల్స్-మార్బుల్, బిల్డింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రిక్ వస్తువులు మొదలైన భిన్నమైన వ్యాపారాలున్నాయి.
నాలుగు తరాల కుటుంబ సభ్యులు:
ఈ కుటుంబంలో మొత్తం ఆరు తరాలు ఉండగా.. ప్రస్తుతం నాలుగు తరాల వారు ఈ ఇంట్లో ఉన్నారు. అందరికంటే పెద్ద కృష్ణ కన్నయ్య ప్రసాద్. పదేళ్ల చమి కల్యాణ్ అనే పాప అతి చిన్న వయస్కురాలు. ఈ ఉమ్మడి కుటుంబంలో కృష్ణ కన్హయ్య ప్రసాద్‌కు 75 ఏళ్లు కాగా, ఆ కుటుంబంలో చిన్నవాడైన చిమి కళ్యాణ్ వయసు 10 నెలలే. కృష్ణ కన్హయ్య ప్రసాద్‌కు అజయ్ సింగ్ కళ్యాణ్, విజయ్ కుమార్, జయపరీక్షిత్, రాహుల్ కుమార్, వివేక్ కుమార్ కళ్యాణ్, వికాస్ కుమార్ అనే ఆరుగురు కుమారులు ఉన్నారు. అదే సమయంలో తమ కుటుంబంలో కజిన్స్‌తో కలిపి మొత్తం 9 మంది అన్నదమ్ములని వివేక్ కల్యాణ్ సింగ్ తెలిపారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని పేర్కొన్నారు.
అందరికీ పెళ్లిళ్లు అయ్యాయని, ఇంట్లో మొత్తం 21 మంది పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఉమ్మడి కుటుంబంగానే కాకుండా ఈ ఫామిలీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. నాలుగో తరంలో అజయ్ సింగ్ కళ్యాణ్ కూడా తాత అయ్యాడు. అయితే ప్రస్తుతం ఇంట్లో 12 జంటలు ఉన్నారు. ఈ ఉమ్మడి కుటుంబం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..