AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: భారీ వర్షాలతో బిహార్ అతలాకుతలం.. ఈదురుగాలుల బీభత్సానికి 27 మంది మృత్యువాత

బిహార్‌లో(Bihar) భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 27 మంది మరణించారు. మరో 24 మంది...

Bihar: భారీ వర్షాలతో బిహార్ అతలాకుతలం.. ఈదురుగాలుల బీభత్సానికి 27 మంది మృత్యువాత
Rains
Ganesh Mudavath
|

Updated on: May 20, 2022 | 9:54 AM

Share

బిహార్‌లో(Bihar) భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు 27 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముజఫర్‌పూర్‌, భాగల్‌పూర్‌లో ఆరుగురు చొప్పున, లఖిసరాయ్ లో ముగ్గురు, వైశాలి, ముంగేర్‌లలో ఇద్దరి చొప్పున మరణించారు. బంకా, జాముయి, కతిహార్, జెహానాబాద్, సరన్, నలంద, బెగుసరాయ్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు అంచనా వేశారు. ఈదురుగాలుల తాకిడికి రోడ్డుపై కంటైనర్ బోల్తా పడంది. నదిలో పడవులు చిక్కుకున్నాయి. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. అంతే కాదు.. పలు విమాన సర్వీసులనూ రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. పాట్నా(Patna) నుంచి భాగల్‌పూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. ఫలితంగా సమాచార వ్యవస్థ దెబ్బతింది. ఖాదియాలోని బీఎస్​ఎన్​ఎల్​ టవర్‌ కూలిపోగా పలు జిల్లాల్లో మొబైల్ టవర్లలో సాంకేతిక లోపం తలెత్తింది. విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది మరమ్మతులను వేగవంతం చేసి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. సమస్తిపూర్, భాగల్‌పూర్, ఖగారియా, దర్భంగా, మధుబని, తూర్పు చంపారన్, సీతామర్హి, షెయోహర్, ముజఫర్‌పూర్, బెగుసరాయ్ సహా మరికొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు.. ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారంనాటి నుంచి ఆ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకుని ఆరుగురు దుర్మరణం చెందగా.. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందినట్లు అసోం ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బనడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

IPL 2022 Playoff Scenario: బెంగళూర్ విజయంతో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ఆ రెండు జట్లు.. టాప్ 4లో ఎవరున్నారంటే?

Love proposal: ఓ పక్క ప్రేయసి తండ్రికి అంత్యక్రియలు జరుగుతుంటే.. ఆ ప్రియుడు ఏంచేశాడో చూడండి..