ఎండలు మండిపోతున్నాయ్.. వానలు ముంచెత్తుతున్నాయ్.. వాతావరణ మార్పులతో భారత్ సతమతం

ఎండలు మండిపోతున్నాయ్. వానలు ముంచెత్తుతున్నాయ్. చలి వణికించేస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో పెను విపత్కర మార్పులు నెలకొన్నాయి. ఎండాకాలంలో వర్షాలు కురవడం, వానా కాలంలో చలి పెట్టడం, చలి కాలంలో....

ఎండలు మండిపోతున్నాయ్.. వానలు ముంచెత్తుతున్నాయ్.. వాతావరణ మార్పులతో భారత్ సతమతం
Temperatures
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 20, 2022 | 10:21 AM

ఎండలు మండిపోతున్నాయ్. వానలు ముంచెత్తుతున్నాయ్. చలి వణికించేస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో పెను విపత్కర మార్పులు నెలకొన్నాయి. ఎండాకాలంలో వర్షాలు కురవడం, వానా కాలంలో చలి పెట్టడం, చలి కాలంలో ఎండలు కాయడం వంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణం(Weather)లో జరుగుతున్న ఈ మార్పులు చాలా మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. భారత దేశానికి(India) పెను ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని తాజా ఓ అధ్యయనం వెల్లడించింది. పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పుల కారణంగా దేశంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల ముప్పు 100 రెట్లు పెరిగిందని పేర్కొంది. పాకిస్తాన్ లోనూ ఇదే రకమైన ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు 2010 ఏప్రిల్‌-మే నెలల్లో నమోదయ్యాయి. ఆ స్థాయి రికార్డు ఎండలు సగటున 312 ఏళ్లకు ఒకసారి మాత్రమే నమోదవుతాయని గతంలో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే- పర్యావరణంలో వేగంగా వస్తున్న ప్రతికూల మార్పుల కారణంగా ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో ప్రతి 3.1 ఏళ్లకు ఒకసారి అంతకుముందున్న రికార్డుతో పోలిస్తే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు నెలకొందని తాజా అధ్యయనం హెచ్చరించింది.

మరోవైపు.. 2019లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కన్నా భారత్‌లోనే కాలుష్య మరణాలు అత్యధికమని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది. 23.5 లక్షల మందికి పైగా అకాల మృత్యువు బారిన పడ్డారని నివేదిక తెలిపింది. వాయు కాలుష్యం కారణంగా 16.7 లక్షల మంది మంది మరణించారని వెల్లడించింది. వాయు కాలుష్య మరణాల్లో అత్యధికంగా గాలిలో రెండున్న ర మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ ఉండే చిన్న కాలుష్య కారకాల కారణంగా(PM2.5)9.8 లక్షల మంది మరణించారని, మరో 6.1 లక్షల మంది గృహ వాయు కాలుష్యం కారణంగా మరణించారని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Mahesh Babu: మహేశ్‌, త్రివిక్రమ్‌ సినిమాపై ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌.. క్యామియో రోల్‌లో కనిపించనున్న ఆ స్టార్‌ హీరో!

Anushka Sharma: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. షాక్‌లో అభిమానులు