AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US India Package: భారత్‌ను బుజ్జగిస్తున్న అమెరికా.. ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం.. బైడెన్ నయా ప్రయత్నాలివే..!

US India Package: ఉక్రెయిన్‌-రష్యా వార్‌ విషయంలో భారత్‌ వైఖరిపై గుర్రుగా ఉన్న అమెరికా ఇప్పుడు బుజ్జగింపు ప్రయత్నాలకు దిగింది. భారత్‌ తన రక్షణ అసరాల..

US India Package: భారత్‌ను బుజ్జగిస్తున్న అమెరికా.. ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం.. బైడెన్ నయా ప్రయత్నాలివే..!
Modi Biden
Shiva Prajapati
|

Updated on: May 20, 2022 | 7:57 AM

Share

US India Package: ఉక్రెయిన్‌-రష్యా వార్‌ విషయంలో భారత్‌ వైఖరిపై గుర్రుగా ఉన్న అమెరికా ఇప్పుడు బుజ్జగింపు ప్రయత్నాలకు దిగింది. భారత్‌ తన రక్షణ అసరాల కోసం రష్యా మీద ఆధారపడకుండా చూసేందుకు 500 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి ఇచ్చేందుకు సిద్ధమైంది. భారత్‌ను తమ దీర్ఘకాలిక భాగస్వామిగా నిల్పుకునేందుకు బైడెన్‌ ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌తో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న అమెరికాకు ఉక్రెయిన్‌ పరిణామాలు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. రష్యా చర్యను భారత్‌ ఖండించకుండా తటస్థ వైకరి తీసుకోవటం అమెరికాకు నచ్చలేదు. రష్యాతో మన దేశానికి మొదటి నుంచి ఉన్న సంబంధాలున్నాయి. ఆ దేశం ఎప్పటి నుంచో మనకు ప్రధాన ఆయుధాల సప్లయర్‌గా ఉంది. తాజగా చవకగా ఆయిల్‌ సరఫరా చేసుందుకు కూడా సిద్ధపడింది.. రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని భారత్‌ మీద అమెరికా చేసిన వత్తిడులు ఫలించలేదు. దీంతో అగ్రరాజ్యం ఈ విషయంలో ఒక అడుగు వెనక్కి వేయక తప్పలేదు.

భారత్‌ పరిస్థితిని అర్థం చేసుకున్న అమెరికా మరో రూటులో బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆయుధాలు, సైనిక అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్యాకేజీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్యాకేజీ విలువ 500 మిలియన్‌ డాలర్ల ఉటుందని భావిస్తున్నారు. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌, ఈజిప్ట్‌తో పాటు పలు దేశాలకు ఈ తరహా సాయం అందిస్తోంది. ఈ డీల్‌ కింద భారత్‌కు ఆయుధాలను అందించబోతోంది అమెరికా. అయితే ఎలాంటి ఆయుధాలు మనకు సరఫరా చేస్తారు అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూ దీర్ఘకాలిక నమ్మకమైన భాగస్వామిగా చూడాలని అమెరికా భావిస్తోంది. ప్రచ్చన్న యుద్దం ముగిసిన ఈ మూడు దశాబ్దాలలో భారత్‌-అమెరికా మధ్య బంధం ఎంతో బలపడింది. భారత్‌ నాటో సభ్య దేశం కాకపోయినా ఆ స్థాయిలో తన మిలటరీ భాగస్వామిగా చేసుకుంది అమెరికా.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సైనిక లాజిస్టిక్స్ మార్పిడి, సురక్షిత సమాచార మార్పిడి కోసం అనేక ఒప్పందాలు కుదిరాయి. తాజా ప్యాకేజీ అమలైతే అమెరికా నుంచి ఇటువంటి సాయం అత్యధికంగా పొందుతున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు.