5G call at IIT Madras: 5G కాల్స్‌ టెస్ట్ విజయవంతం.. వాయిస్, వీడియో కాల్స్‌ పరీక్షించిన కేంద్ర మంత్రి..

5G call at IIT Madras: కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ IIT మద్రాస్‌లోని 5G టెస్ట్-బెడ్‌ను సందర్శించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన నెట్‌వర్క్‌లో

5G call at IIT Madras: 5G కాల్స్‌ టెస్ట్ విజయవంతం.. వాయిస్, వీడియో కాల్స్‌ పరీక్షించిన కేంద్ర మంత్రి..
Minister
Follow us

|

Updated on: May 20, 2022 | 7:51 AM

5G call at IIT Madras: కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ IIT మద్రాస్‌లోని 5G టెస్ట్-బెడ్‌ను సందర్శించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన నెట్‌వర్క్‌లో 5G కాల్‌ను విజయవంతంగా పరీక్షించారు. వీడియో, వాయిస్ కాల్స్ చేసి 5G నెట్‌వర్క్‌ని పరీక్షించారు. దేశీయంగా అభివృద్ది చేసిన ఈ నెట్‌వర్క్ సూపర్ అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘‘5G టెస్ట్ ప్యాడ్‌ను అభివృద్ధి చేసిన IIT మద్రాస్ బృందం కృషికి గర్విస్తున్నాం. ఇది మొత్తం 5G అభివృద్ధి పర్యావరణ వ్యవస్థ, హైపర్‌లూప్ చొరవకు భారీ అవకాశాలను అందిస్తుంది.’’ అని పేర్కొన్నారు. హైపర్‌లూప్ చొరవకు రైల్వే మంత్రిత్వ శాఖ పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు. 5జీ సేవలకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నుండి దేశంలో స్వదేశీ 5G సేవలు ప్రారంభమవుతాయన్నారు. 5జీ ద్వారా దేశంలో 1.5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మాట్లాడుతూ.. వచ్చే ఒకటిన్నర సంవత్సర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు 5G 450 బిలియన్ డాలర్లను అందించబోతోందన్నారు. దశాబ్దాల పాటు ఇది దేశ ప్రగతికి తోడ్పడుతుందని, ఉపాధి కల్పన అవకాశాలు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దపు కనెక్టివిటీ దేశ ప్రగతి వేగాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. ఈ సమయంలో, IIT మద్రాస్ నాయకత్వంలో మొత్తం ఎనిమిది సంస్థలచే బహుళ-సంస్థల సహకార ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేయబడిన 5G టెస్ట్ బెడ్‌లను కూడా PM మోడీ ప్రారంభించారు. దాంతోపాటు ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేశారు.