Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Political heat: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ పాలిటిక్స్‌..నేతలంతా విదేశాల్లో.. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీట్‌ తగ్గిందా..?

గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పొలిటికల్‌ హీట్‌... ఒక్కసారిగా తగ్గనుంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా పర్యటనలు.. వారి ప్రసంగాలకు కౌంటర్‌ అటాక్‌తో హాట్‌ హాట్‌గా సాగిపోయింది. ఇప్పుడు నేతలు రిలాక్స్‌ కోరుకుంటున్నారట.

Political heat: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ పాలిటిక్స్‌..నేతలంతా విదేశాల్లో.. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీట్‌ తగ్గిందా..?
Political Heat
Follow us
Jyothi Gadda

|

Updated on: May 21, 2022 | 3:02 PM

గత వారం పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పొలిటికల్‌ హీట్‌… ఒక్కసారిగా తగ్గనుంది. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌, కేంద్ర మంత్రి అమిత్‌ షా పర్యటనలు.. వారి ప్రసంగాలకు కౌంటర్‌ అటాక్‌తో హాట్‌ హాట్‌గా సాగిపోయింది. ఇప్పుడు నేతలు రిలాక్స్‌ కోరుకుంటున్నారట. కొంతమంది అధికారిక పర్యటనలు… మరికొంతమంది అనధికార పర్యాటనలకు సిద్ధమయ్యారట. ఇక ఇంకొంత మంది ఆఫీషియల్‌ టూర్‌కు సమ్మర్‌ వెకెషన్‌ జోడించి టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారట. తెలంగాణకు పొలిటికల్‌ టూరిస్ట్‌లు వస్తుంటారు.. పోతుంటారని హాట్‌ కామెంట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ లండన్‌ టూర్‌లో ఉన్నారు. అటునుంచి అటే దావోస్‌కు టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారట. కేటీఆర్‌ విదేశీ పర్యాటనను అఫీసియల్‌ టూర్‌గానే చెబుతున్నారు అధికారులు. ఇక ఏపీ సీఎం జగన్‌ పెట్టుబడుల సేకరణకు దావోస్‌లో పర్యటనలో బిజీగా ఉన్నారు.. ఇక వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేసి అలిసిపోయి.. అమెరికా టూర్‌లో ఉన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి… ఈ నెల 25న అమెరికా టూర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెనర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆల్‌రెడీ స్విజ్జర్లాండ్‌ టూర్‌లో ఉన్నారు. అటు నుంచి అటే ఇటలీ వెళ్లిరానున్నారట. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కమార్‌ గౌడ్‌ ఇప్పటికే విహారం నిమిత్తం అమెరికా వెళ్లిపోయారు. ఇక ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక తటాపటాయిస్తున్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమ్మర్‌ వెకెషన్స్‌లో భాగంగా లండన్‌ చేరుకున్నారు.

బీజేపీలోని పలువురు నేతలు కూడా హాలీడే మూడ్‌లోకి వెల్లిపోయారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. ఈ నెల22న అమెరికా వెళ్లబోతున్నారు. సమ్మర్‌ వెకెషన్స్‌తో పాటు.. నాటా సభల్లో ఆమె పాల్గొనబోతున్నారట. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌… అధికారిక కార్యక్రమంతో పాటు దైవదర్శనాల నిమిత్తం జైపూర్‌ వెళ్లబోతున్నారట.మొత్తానికి అన్ని పార్టీల నేతలు హాలీడే మూడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

రిపోర్టర్ః అగస్త్య కంటు