Driver death mystery:డ్రైవర్ సుబ్రమణ్యం డెత్ మిస్టరీ, హత్య కేసులో వారిని సైడ్ చేస్తున్నారా…? కేసులో అన్ని సంచలనాలే !!

Driver death mystery:డ్రైవర్ సుబ్రమణ్యం డెత్ మిస్టరీ, హత్య కేసులో వారిని సైడ్ చేస్తున్నారా…? కేసులో అన్ని సంచలనాలే !!
Subramanyam

కాకినాడలో ఎమ్మెల్సీ (kakinada mlc) అనంత ఉదయ్ బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించటపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు

Jyothi Gadda

|

May 21, 2022 | 5:35 PM

కాకినాడలో ఎమ్మెల్సీ (kakinada mlc) అనంత ఉదయ్ బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీగా మారింది. రోజులు గడుస్తున్నప్పటికీ కేసులో ఎలాంటి పురోగతి కనిపించటపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు పైనే ఈ కేసులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుబ్రమణ్యంను హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ దళిత సంఘాలు కాకినాడలో ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ ని అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టంకు అంగీకరిస్తామని చెప్తున్నారు బంధువులు. ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేయకపోవడంతో పోస్టుమార్టం కూడా నిలిచిపోయింది. సుబ్రహ్మణ్యం చావులో అతని ప్రమేయం లేకపోతే.. బయటికి వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నట్టు? కాకినాడలోనే ఉన్నారా.. లేక పక్క రాష్ట్రం పారిపోయారా? అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతి లభించలేదు. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కని వ్యవహరంగా మారింది. డెడ్‌బాడీకి పంచనామా పూర్తి చేయలేదు. పోస్ట్ మార్టం జరగలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోలేదు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే దానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. మరోవైపు, మృతుడి ఒంటిపై తీవ్ర గాయాలు ఉండటం, ఒంటిపై కమిలిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తుండటం, సముద్రపు ఇసుక ఒళ‌్ళంతా అంటుకుని ఉండటంతో వ్యక్తిగత కారణాలతో హతమార్చి ఉంటారని బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, పోస్టుమార్టం తర్వాతే కేసు ముందుకు వెళుతుందంటున్నారు ASP శ్రీనివాస్‌. ప్రస్తుతం అనుమానాస్పద కేసుగా నమోదు చేశామనీ.. నిందితులెవరైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అనంతబాబు దౌర్జన్యాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. రంపచోడవరం పరిధిలో ఆయన అరాచకాలకు హద్దే లేదని మండిపడుతున్నారు బాధితులు. అవసరం పేరుతో అప్పులివ్వడం ఆ తర్వాత వేధిస్తున్నారని కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబు మే 20న ఓ పెళ్లి వేడుకకు హాజరై.. ఆ తర్వాత మళ్లీ మాయమైనట్టుగా తెలుస్తోంది. అందుకు సాక్షంగా నిలుస్తన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

Kakinada Mlc

Kakinada Mlc

ఎమ్మెల్సీ అనంత బాబును వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గేట్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మార్చురీ దగ్గర సిపిఐ, బిజెపితో పాటు దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మార్చురీకి అడ్డంగా భారీకేడ్లు పెట్టడంతో రోడ్డుపైనే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అనంతబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసి విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయంటోంది టీడీపీ. సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై టీడీపీ నిజనిర్ధరణ కమిటీ వేసింది. పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఎంఎస్​ రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావుతో కూడిన బృందం…. మృతి ఘటనకు సంబంధించిన నివేదికను చంద్రబాబుకు అందించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu