AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ‘ఒరేయ్ పంతులూ ..’ అని మాతోనే పెట్టుకుంటావా..మాజీ మంత్రిపై భగ్గుమంటున్న బ్రహ్మణ సంఘాలు..

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ చిక్కుల్లోపడ్డారు. ఆయనపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ..

AP News: 'ఒరేయ్ పంతులూ ..' అని మాతోనే పెట్టుకుంటావా..మాజీ మంత్రిపై భగ్గుమంటున్న బ్రహ్మణ సంఘాలు..
Avanti Srinivas
Jyothi Gadda
|

Updated on: May 21, 2022 | 3:25 PM

Share

మాజీ మంత్రి అవంతి((Avanti Srinivas) శ్రీనివాస్‌ చిక్కుల్లోపడ్డారు. ఆయనపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రసీదు ఇచ్చి పంపించారు. ఇటీవల పద్మనాభం మండలం కోరాడలో రైతు భరోసా బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన సమస్య పరిష్కరించాలని.. వేదిక ముందు ఆందోళన చేశారు. ఆయనను సముదాయించాల్సిన అవంతి.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనపైనే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. కులం పేరుతో వ్యక్తిని దూషించడం ఏంటని నిలదీస్తున్నాయి. మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణ సంఘాల నేతలు.

మే16న విశాఖ జిల్లా పద్మనాభ మండలం, కోరాడ గ్రామంలో రైతు భరోసా సభ జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ బ్రాహ్మణులను ఉద్దేశిస్తూ.. పంతులూ, నీ అంతు చూస్తా అంటూ కులదూషణ చేశారని బ్రాహ్మణ సంక్షేమ వేదిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించినట్లుగా కొన్ని వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాజానికి సేవ చేసే ప్రజాప్రతినిధిగా ఉన్న వ్కక్తి ఇలా మాట్లాడటం సబబుకాదంటూ బ్రాహ్మణ సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి పునరావృత్తం అయితే బ్రాహ్మణ సంఘాలు చూస్తూ ఊరుకోమని అంటున్నారు. ఐపీసీ 153(C), 509(A) ప్రకారం మాజీ మంత్రి అవంతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు, వివిధ సామాజికవర్గ సంఘాలు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు పోలీస్ ఫిర్యాదు కూడా నమోదు కావడంతో చిక్కుల్లో పడ్డారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.

Follow Us
ఇడ్లీ-దోసె పిండి రాత్రంతా పెట్టినా పొంగడం లేదా? ఈ ట్రిక్‌ తెలుసా
ఇడ్లీ-దోసె పిండి రాత్రంతా పెట్టినా పొంగడం లేదా? ఈ ట్రిక్‌ తెలుసా
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
దసరాకు ఇంటికెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ఛార్జీలపై పండుగే..
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు.. ఒకేసారి ఎంతంటే..?
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
మిగిలిన అన్నంతో క్రిస్పీ కట్లెట్స్.. ఎలా చేయాలి అంటే?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
చలికాలంలో గుడ్లు తింటే శరీరానికి ఎలాంటి పోషకాలు అందుతాయి?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. IMDB టాప్ రేటింగ్ మూవీ