AP News: ఓ కంపెనీలో రూ.3కోట్ల దొంగతనం,రంగంలోకి దిగిన పోలీసోళ్లు, కట్‌చేస్తే..ట్విస్ట్‌లే ట్విస్టులు..!
ప్రకాశంజిల్లా (prakasam district) ర్నాలలో భారీ దోపిడీ జరిగింది. కారును అటకాయించి 3 కోట్ల రూపాయలు దోచుకున్నారు దొంగలు... కోల్‌కతా నుంచి కర్ణాటకలోని హౌస్ పేట బయలుదేరిన బాధితులను... యడ్లవల్లి సమీపంలో కారును అడ్డగించిన దొంగలు..
ప్రకాశంజిల్లా (prakasam district) ర్నాలలో భారీ దోపిడీ జరిగింది. కారును అటకాయించి 3 కోట్ల రూపాయలు దోచుకున్నారు దొంగలు… కోల్‌కతా నుంచి కర్ణాటకలోని హౌస్ పేట బయలుదేరిన బాధితులను… యడ్లవల్లి సమీపంలో కారును అడ్డగించిన దొంగలు డబ్బులు దోచుకుని పరారయ్యారు. ఇలా వారం రోజులుగా జరుగుతున్న ప్రచారంలో పెద్ద ఎత్తున డబ్బులు చోరీకి గురయ్యాయన్న అనుమానాలపై ఎలాంటి ఆధారాలు లేవని ప్రకాశంజిల్లా ఎస్‌పి మలికగార్గ్ ప్రకటించారు… గుజరాత్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు కూడా రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా కేసు నమోదు చేశామని, ఒకవేళ పెద్ద ఎత్తున డబ్బులు పోయాయని ఆధారాలు లభిస్తే ఇన్‌కంటాక్స్ అధికారులకు కూడా సమాచారం ఇస్తామని ఎస్‌పి తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌కు చెందిన కాలురామ్, అరవింద్ కారులో కోల్‌కతా నుంచి కర్ణాటకలోని హౌస్ పేటకు బయలుదేరారు. మే16వ తేదిన అర్ధరాత్రి సమయంలో వీరి కారు దోర్నాల మండలం యడవల్లి సమీపానికి చేరుకుంది. అదే సమయంలో వారి కారును ఫాలో అవుతూ వచ్చిన మరో కారులోని దుండగులు బాధితుల కారును అడ్డగించారు. ఆ పక్కనే ఉన్న బలిజేపల్లి రహదారిలోకి కారును మళ్లించారు. కొంతదూరం వెళ్లాక కారులో ఉన్న వారిని కత్తితో బెదిరించి వారి వద్దనున్న నగదును దోచుకున్నారు. అనంతరం ఆ కారు కీస్ చెట్లలోకి విసేరేసి వెళ్లిపోయారు. దీంతో బాధితులు కారును అక్కడే వదిలేసి కాలినడకన బయలుదేరి, 100కు డయల్ చేసారు.. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు. కారుపైనున్న వేలిముద్రలు సేకరించారు. కాగా, బాధితులు పొంతన లేకుండా సమాధానాలు చెబుతుండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ గోప్యంగా విచారణ చేపట్టారు..
మరోవైపు 3 కోట్ల రూపాయలు దోపిడీకి గురయ్యాయన్న ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు… అయితే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పొంతన లేని సమాధానం చెప్పడం, వీరిద్దరు పనిచేస్తున్న గుజరాత్‌కు చెందిన ఎం.కె. ఎంటర్ ప్రైజెస్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున డబ్బు పోయిందని ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది… ఇదంతా హవాలా డబ్బుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కారు కూడా గుజరాత్ సంస్థ పేరుతో లేదని పోలీసులు గుర్తించారు… అసలు యజమాని ఎవరో ఆరా తీస్తున్నారు… గుజరాత్‌కు చెందిన సంస్థ ప్రతినిధులు తమ కంపెనీకి చెందిన డాక్యుమెంట్లతో పాటు ఎంత డబ్బు పోయిందన్న విషయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరి వారం రోజులైనా, కంపెనీ ప్రతినిదుల నుంచి ఎలాంటి స్పందన లేదు… అంతేకాకుండా కారులో అనుమానాస్పదంగా ఓ ప్రత్యేకమైన అర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇది హవాలా డబ్బు కావడంతోనే గుజరాత్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు కానీ, కారులో ప్రయాణిస్తున్న కంపెనీ ఉద్యోగులు కానీ స్పష్టమైన ఫిర్యాదు చేయలేదన్న అనుమానాలు కూడా ఉన్నాయి… వీటన్నింటి నేపధ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు దోర్నాల దగ్గర కారును అటకాయించి 3 కోట్ల రూపాయలు దోపిడీ చేశారన్న ప్రచారంలో ఆధారాలు లేవని ఎస్‌పి మలికగార్గ్ ప్రకటించారు… గుజరాత్‌కు చెందిన ఎం.కె. ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కారులో వెళుతుండగా యడవల్లి దగ్గర దోపిడీ జరిగిందని 100 నెంబర్‌కు ఫిర్యాదు చేశారన్నారు… ఫిర్యాదుదారులు కేవలం లక్ష రూపాయలు మాత్రమే చోరీ అయ్యాయని చెబుతున్నారని, పెద్ద మొత్తంలో దోపిడీ జరిగిందని చెప్పకపోవడమే కాకుండా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారన్నారు… కారు ఓనర్ ఎవరో గుర్తించాల్సి ఉందన్నారు… చోరీకి గురైన కారులో ఎంత డబ్బు ఉందనేది కంపెనీ నుంచి ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు… ఇప్పటికే కేసు నమోదు చేశామని, రాతపూర్వకంగా ఎంత డబ్బు చోరీకి గురైందన్న ఫిర్యాదు చేస్తే దర్యాప్తు ముమ్మరం చేస్తామని ఎస్‌పి స్పష్టం చేశారు… కారులో ఉన్న వ్యక్తుల ఫిర్యాదు అనుమానాస్పదంగా ఉందన్నారు… ఒకవేళ డబ్బు పెద్ద మొత్తంలో తరలిస్తున్నారని తేలితే ఇన్‌కంటాక్స్ అధికారులకు సమాచారం ఇస్తామని ఎస్‌పి తెలిపారు.