Crime: ఆన్ లైన్ రమ్మీకి బానిసైన ఇంజనీరింగ్ స్టూడెంట్.. అప్పులిచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక..
Crime: ఆ కుర్రాడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంకో ఏడాది పూర్తయితే డిగ్రీ చేతికొచ్చేది. హాయిగా ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సాగించేవాడు. కానీ తాను ఓ తప్పు జీవితాన్నే తల కిందులు చేసేసింది. ఆన్‌లైన్ మాయలో పడి...
Crime: ఆ కుర్రాడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంకో ఏడాది పూర్తయితే డిగ్రీ చేతికొచ్చేది. హాయిగా ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సాగించేవాడు. కానీ తాను ఓ తప్పు జీవితాన్నే తల కిందులు చేసేసింది. ఆన్‌లైన్ మాయలో పడి ప్రాణాలనే బలి తీసుకున్నాడు. జీవితం చివరి క్షణాల్లో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన వాడు విగత జీవిగా మారి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. ఈ విచారకరమైన సంఘటన శనివారం అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మండ్యంకు చెందిన దిలీప్ రెడ్డి పలమనేరులోని మదర్ థెరిస్సా కాలేజీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలోనే దిలీప్ ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. మొదట అలవాటుగా మొదలైన ఈ గేమ్ తర్వాత వ్యసనంగా మారింది. చేతిలో ఉన్న డబ్బులన్నీ పోయే సరికి అప్పు చేసి మరీ ఆడడం ప్రారంభించాడు. అలా అప్పులు కొండలా పేరుకుపోయాయి. దీనికి తోడు బెట్టింగ్‌లు కూడా దిలీప్‌ను ఆర్థికంగా దెబ్బతిశాయి. దీంతో సెల్ ఫోన్‌ను సైతం తాకట్టు పెట్టాడు. అయితే తీసుకున్న అప్పులకు అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఒకటికి రెండుసార్లు డబ్బులివ్వమని అడగడంతో సమాధానం చెప్పుకోలేక పోయాడు. ఈ సమస్యకు తన చావే పరిష్కారమనే పిచ్చి ఆలోచన చేశాడు. ఈ క్రమంలోనే పలమనేరు భజంత్రీ వీధిలో అద్దెకు తీసుకున్న గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతుకొచ్చిన కొడుకు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో దిలీప్ పేరెంట్స్ కన్నీరు మున్నీరయ్యారు.
తెలిసో తెలియకో ఆన్‌లైన్ గేమ్స్‌లో డబ్బులు పొగొట్టుకున్న వారు అక్కడితోనే జీవితం ముగిసిందని భ్రమపడుతున్నారు. రేపు అనే అందమైన భవిష్యత్తు ఉందని మర్చిపోతున్నారు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా ధైర్యంతో ఎదుర్కోవచ్చనే కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోవడానికి కష్టపడి పనిచేస్తే వంద మార్గాలు ఉంటాయి. ఆ దిశగా అడుగులు వేయాలి కానీ ఇలా తనువు చాలించి కన్నవారిని క్షోభకు గురి చేయడం సరైంది కాదు.
మరన్ని నేర సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..