CM KCR: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భేటీ.. దేశ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ ప‌ర్యట‌న‌లో ఉన్నారు. ఢిల్లీ ప‌ర్యట‌న‌లో భాగంగా వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాజకీయ పార్టీల నేతలతోపాటు..

CM KCR: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ భేటీ.. దేశ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి
Follow us
Subhash Goud

|

Updated on: May 21, 2022 | 2:43 PM

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ ప‌ర్యట‌న‌లో ఉన్నారు. ఢిల్లీ ప‌ర్యట‌న‌లో భాగంగా వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రముఖ ఆర్థికవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ఈ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్యాహ్నం అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు.

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశమవనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. అయితే ఢిల్లీ, పంజాబ్‌లలో మరణించిన రైతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కేసీర్‌ ఏటీ కానున్నారు. రెండు నెలల కిందటనే కేజ్రీవాల్‌తో భేటీ కావాల్సిన కేసీఆర్‌.. ఢిల్లీ సీఎం బెంగళూరులో ఉన్నందు ఆ బేటీ జరగలేదు. జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండాగా సాగే పర్యటనపై అందరి దృష్టి పడింది.

ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి పర్యటన ఢిల్లీ నుంచి మొదలవుతుంది. ముందుగా ఈ నెల 22వ తేదీన ఛండీగఢ్‌కు వెళ్తారు. అక్కడ జాతీయ రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అనంతరం గత ఏడాది ఢిల్లీ వేదికగా జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన పంజాబ్‌, హర్యానా, యూపీ, ఢిల్లీకి చెందిన సుమారు 600 రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌తో కలిసి పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశమవనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.

మరిన్ని రాజకీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి