PM Modi Daily Routine: ప్రధాని నరేంద్ర రోజువారీ దినచర్య.. ఆయన ఏం తింటారు? ఎప్పుడు నిద్రపోతారో తెలుసా?
PM Modi Daily Routine: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
PM Modi Daily Routine: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా మంది ఆయన ధరించే దుస్తులు, ఆయన తినే ఆహారం, ఆయన ఎప్పుడు నిద్రిస్తారు, ఆయన ఫిట్‌నెస్ ఏంటి, మొత్తంగా ఆయన దినచర్య ఏంటనేది తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలోనే.. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా(మే26వ తేదీతో 8 సంవత్సరాలు పూర్తి) ఆయన గురించి ప్రత్యేక కథనాన్ని మీకోసం ఇస్తున్నాం. ఈ కథనంలో ఆయన దినచర్య ఎలా సాగుతుందనేది స్పష్టంగా తెలుసుకుందాం.
4 AM :- ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రోజూ ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేస్తారు. నిద్రలేచిన తరువాత ఫ్రెషప్ అయ్యి.. యోగా చేస్తారు. సూర్యనమస్కారం, ప్రాణాయామం వంటి సాధన చేస్తారు. ఆ తరువాత అల్లం టీ తాగుతారు. ఆ తరువాత మితంగా అల్పాహారం తీసుకుంటారు.
8 AM :- అల్పాహారం తర్వాత మోడీ చేసే ముఖ్యమైన పని వార్తాపత్రికలు తిరగేస్తారు. అన్ని రకాల వార్తా పత్రికలను ఆయన చదువుతారు. ముఖ్యంగా ఇంగ్లీష్, గుజరాతీ వార్తా పత్రికలను ఆయన చదువుతారు.
9 AM :- ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ కార్యాలయం నుంచే పని చేస్తారు. సౌత్ బ్లాక్ 77, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని కార్యాలయం నుంచే పని చేస్తారు. ఉదయం 9 గంటల ప్రధాని కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇంటి నుంచి ఆఫీసుకు ఆయన నడక ద్వారా వెళతారు.
11.30 AM :- భోజన సమయం. ప్రధాని మోదీ 11.30 భోజనం చేస్తారు. గుజరాతీ, ఖిచ్డీ, కధీ, ఉప్మా, బక్రీ, ఖాక్రా వంటి కొన్ని ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతారు. మోదీకి వంట చేయడానికి గుజరాతీ వంట మనిషి కూడా ఉన్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా వంట మనిషిని తన వెంట తీసుకెళ్తారు. లంచ్ టైమ్ అయిన తరువాత ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారాయన.
10 PM :- రాత్రి 10 గంటలకు టీవీ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు ప్రధాని మోదీ. కొన్ని న్యూస్ ఛానెళ్ల టీవీ డిబేట్‌లను చూస్తారు. సాధారణ రోజుల్లో ప్రధాని మోదీ తన సౌత్ బ్లాక్ కార్యాలయంలోనే రోజుకు 14 గంటల పాటు పని చేస్తారు. రాత్రి భోజనం చేసిన తరువాత తనకు వచ్చిన ఈమెయిల్స్‌ని చెక్ చేస్తారు. దానికి ప్రత్యుత్తరం కూడా ఇస్తారు.
1 AM :- ముఖ్యమైన పనులన్నింటినీ పూర్తి చేసిన తరువాత రాత్రి 1 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజులో కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. మళ్లీ ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేస్తారు.
ప్రధాని మోదీకి ఏం ఇష్టం.. ప్రధాని మోదీకి తన కార్యాలయంలో చదవడానికి సమయం దొరకనప్పటికీ.. చదవడం అంటే చాలా ఇష్టపడుతారు. చిన్నతనంలోనే నరేంద్ర మోదీ.. స్వామి వివేకానంద పట్ల చాలా ఆకర్షితులయ్యారు. స్వామి వివేకానందకు సంబంధించిన అన్ని పుస్తకాలను మోదీ చదివారు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్నప్పటి నుంచి వ్యాయామం, చదవడం, సామాజిక సేవ చేయడాన్ని మోదీ అమితంగా ఇష్టపడుతారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒకసారి మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ నిద్ర పోరు.. తమ మంత్రిని నిద్రపోనివ్వరు’ అని పేర్కొన్నారు.