Andhra Pradesh: ఏందీ పంచాయతీ.. రోడ్డెక్కారో మర్యాదుండదు.. ఎమ్మెల్యే, మేయర్‌‌కు ఎంపీ క్లాస్..

గుంటూరు కార్పొరేషన్‌లో వైసిపి నేతల మధ్య గొడవ సద్దుమణిగిందా.. కార్పొరేషన్‌ వివాదాన్ని ప్రాంతీయ సమన్వయకర్త పరిష్కరించారా.. మేయర్ మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫాను ఆఫీసుకు పిలిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారా. ఆతర్వాత నేతలిద్దరూ స్వరం మార్చారా.. తమ మధ్య విభేదాలు మీడియా సృష్టేనని చెబుతున్నారా.. చూస్తుంటే అది అనిపిస్తోంది.

Andhra Pradesh: ఏందీ పంచాయతీ.. రోడ్డెక్కారో మర్యాదుండదు.. ఎమ్మెల్యే, మేయర్‌‌కు ఎంపీ క్లాస్..
Ycp
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2023 | 9:13 AM

గుంటూరు కార్పొరేషన్‌లో వైసిపి నేతల మధ్య గొడవ సద్దుమణిగిందా.. కార్పొరేషన్‌ వివాదాన్ని ప్రాంతీయ సమన్వయకర్త పరిష్కరించారా.. మేయర్ మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫాను ఆఫీసుకు పిలిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారా. ఆతర్వాత నేతలిద్దరూ స్వరం మార్చారా.. తమ మధ్య విభేదాలు మీడియా సృష్టేనని చెబుతున్నారా.. చూస్తుంటే అది అనిపిస్తోంది.

కార్పొరేటర్ల స్పెషల్ మీటింగ్‌..

మూడు రోజుల క్రితం గుంటూరు కార్పొరేషన్ లోని పదమూడు మంది కార్పొరేటర్లు.. ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. ఆ తర్వాత రోజు కమీషనర్ ను కలిసి కార్పొరేషన్ లో అవినీతి జరుగుతోందంటూ ఆమెకే ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే.. మేయర్‌ మధ్య ఉయ్యాల.. జంపాలా..

కార్పొరేటర్ల అసంతృప్తి వెనుక ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారని, మేయర్‌తో ఉన్న విబేధాల కారణంగానే కార్పోరేటర్ల సమావేశం అవ్వటం.. కమీషనర్ ను కలవటం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్టీ దృష్టి సారించింది.

ఇవి కూడా చదవండి

పార్టీ ఆఫీసుకు పిలిపించి క్లాస్‌..

ఇద్దరు నేతలను ఎంపి అయోధ్య రామిరెడ్డి ప్రాంతీయ కార్యాలయానికి పిలిపించి క్లాస్ పీకారట.. అంతే కాకుండా విబేధాలు ఉంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని రోడ్డెక్కి పార్టీ పరువు తీయవద్దని హెచ్చరించినట్లు సమాచారం. మొత్తానికి మ్యాటర్‌ను అయోధ్య రామిరెడ్డి అలా సెట్‌ చేశారన్నమాట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..