Andhra Pradesh: నా గొంతు ఆగాలంటే.. నన్ను ఎన్ కౌంటర్ చేయండి.. కోటంరెడ్డి సంచలన కామెంట్స్..
నెల్లూరు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇష్యూ స్టేట్ మొత్తాన్ని కుదిపేస్తోంది. తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ తిరుగుబావుటా ఎగరవేసిన ఆయన.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..

నెల్లూరు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇష్యూ స్టేట్ మొత్తాన్ని కుదిపేస్తోంది. తన ఫోన్ ను ట్యాప్ చేశారంటూ తిరుగుబావుటా ఎగరవేసిన ఆయన.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసని.. ప్రాణాతి ప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిత్తశుద్ధితో పనిచేస్తే అవమానించారని.. అధికారం కొత్త కాదు. ప్రజలకు మేలు చేయడమే తన తపన అని అన్నారు. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవన్న కోటంరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగినట్లు వెల్లడించారు. తప్పుడు ఆరోపణలతో సజ్జల ఆడియోలు వదులుతున్నారని విమర్శించారు. కేసులు పెట్టి అలసి పోవాలే తప్ప.. తన గొంతు ఆగే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. తన గొంతు ఆగాలంటే ఒక్కటే పరిష్కారం అన్న కోటంరెడ్డి.. ఎన్‌కౌంటర్ చేయించండన్నారు.
నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. విద్యార్థి నేతగా మొదలుపెట్టి 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ తో నా మనసు విరిగింది. ఆధారాలు చూపించి బయటకు వచ్చాను. అంతే గానీ అనవసర ఆరోపణలు చేయడం లేదు. మానసిక క్షోభకు గురై వైసీపీ నుంచి బయటకు వచ్చాను. ఒకవేళ చంద్రబాబును కలిస్తే తర్వాత రోజే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు. వైసీపీ పాలనలో థియేటర్లు నడపలేని పరిస్థితి వచ్చింది. ఇసుక, మద్యం పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది. ఎమ్మెల్యేగా మీరు చేసే అభివృద్ధి పనులకు సహకారం అందిస్తాను.
– కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే




ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రభుత్వ చేతిలో పని అన్న కోటంరెడ్డి.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో సమయమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇప్పుడు రాజీనామా చేసినా ఎన్నికలు ఎలాగూ జరగవని, నెల రోజులు పూర్తిగా రాజకీయాలు ఆపేస్తానన్నారు. తన వెంట నడిచే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలుంటాయని కోటంరెడ్డి వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..