Vandebharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు టికెట్ ఛార్జీ ఎంత ఉండబోతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తోన్న ఈ ట్రైన్‌ను..

Vandebharat Express: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు టికెట్ ఛార్జీ ఎంత ఉండబోతుందో తెలుసా?
Vande Bharat Express
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 03, 2023 | 1:48 PM

తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తోన్న ఈ ట్రైన్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రారంభించారు. ఇది దక్షిణాదిన రెండో వందే‌భారత్ రైలు కాగా.. త్వరలోనే మరో ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్దమవుతోంది.

నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ – తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలును ప్రారంభించే దిశగా కేంద్ర రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలోనే ఇది పరుగులు పెడుతుందని సమాచారం. ఈ ట్రైన్‌ను సికింద్రాబాద్ నుంచి వయా నడికుడి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదగా తిరుపతి చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే అందుకు సంబంధించి ట్రయిల్ రన్ కూడా పూర్తయింది. మరి ఈ ట్రైన్‌లో టికెట్ ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి మధ్య దూరం 699 కిలోమీటర్లు.. 8.30 గంటల్లో వందేభారత్ ట్రైన్ ఈ దూరాన్ని చేరుకుంటుంది. అలాగే ఈ రెండు నగరాల మధ్య ఏసీ చైర్ కారు టికెట్ ధర రూ. 1720 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు టికెట్ ధర రూ. 3,170గా నిర్ణయించారు. దీన్ని బట్టి క్యాలికులేట్ చేస్తే.. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య 661 కిలోమీటర్ల దూరం.. దీన్ని వందేభారత్ రైలు సుమారు 8 గంటల్లో చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే సికింద్రాబాద్-వైజాగ్ రూట్‌కు ఉన్న టికెట్ ధరలకు.. రూ. 100-150 అటూ.. ఇటూగా సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్ రేట్లు ఉంటాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీ చైర్ కారు రూ. 1610, ఎగ్జిక్యూటివ్ చైర్ కారు రూ. 3050గా ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర