Mahesh Babu: మరో చిన్నారి ‘గుండె’ను కాపాడిన మహేశ్‌.. పిల్లాడి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపిన శ్రీమంతుడు

గుండె జబ్బులతో బాధపడుతోన్న ఎందరో చిన్నారుల పాలిట ఆపద్భాందవుడయ్యాడు మహేశ్‌. మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు.

Mahesh Babu: మరో చిన్నారి 'గుండె'ను కాపాడిన మహేశ్‌.. పిల్లాడి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపిన శ్రీమంతుడు
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2023 | 2:57 PM

మహేశ్‌బాబు.. అందమైన రూపంతో పాటు అంతకన్నా అందమైన మనసు ఈ టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ సొంతం. అందుకే సినిమాలు చేస్తూనే తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాడీ హ్యాండ్సమ్‌ హీరో. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నాడు. ఇక గుండె జబ్బులతో బాధపడుతోన్న ఎందరో చిన్నారుల పాలిట ఆపద్భాందవుడయ్యాడు మహేశ్‌. మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. తాజాగా మరో ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్‌ చేయించి ఆ పిల్లాడి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపాడు మహేశ్‌. వివరాల్లోకి వెళితే.. క్రాంతి కుమార్‌ అనే ఏడేళ్ల బాలుడు టెట్రాలజీ ఆఫ్‌ ఫాలట్‌ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. 10 వేల మంది నవజాత శిశువుల్లో.. ముగ్గురిలో మాత్రమే ఈ సమస్య ఉంటుందట. పసి పిల్లల ప్రాణాలను హరించేసే ఈ వ్యాధికి చిన్న వయసులోనే తగిన చికిత్స చేయిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు.

తాజాగా క్రాంతి కుమార్‌ విషయం మహేశ్‌ బాబుకు తెలియడంతో గుండె ఆపరేషన్‌కు సాయం చేశారు. బాలుడికి ఆంధ్రా ఆస్పత్రిలో గుండె ఆపరేషన్‌ జరిగింది. ప్రసుత్తం క్రాంతి ఆరోగ్యం నిలకగడానే ఉంది. కాగా తమ అభిమాన హీరో చేస్తోన్న సేవా కార్యక్రమాలను చూసి మహేశ్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. సర్కారు వారి పాట సినిమా సూపర్‌ హిట్ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు మహేశ్‌. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ సినిమాలో నటిస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర