AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K. Viswanath: కళాతపస్వికి కోపం తెప్పించిన సూర్యకాంతం..! విశ్వనాథ్‏కు ఆ టైటిల్ పేరు పెట్టిన లెజండరీ నటి..

దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన విశ్వనాథ్ పోషించారు. ఎంతోమంది దిగ్గజ నటీనటులతో కలిసి పనిచేసిన ఆయనకు... లెజండరీ నటి తెలుగు ప్రేక్షకుల గయ్యాలి అత్త సూర్యకాంతం ఓ టైటిల్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

K. Viswanath: కళాతపస్వికి కోపం తెప్పించిన సూర్యకాంతం..! విశ్వనాథ్‏కు ఆ టైటిల్ పేరు పెట్టిన లెజండరీ నటి..
Viswanath, Suryakantham
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2023 | 1:49 PM

Share

కళాతపస్వి కె. విశ్వనాథ్ తెలుగు తెరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆయన కలం నుంచి రాలిన సినిమాలు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్స్. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్‏తో స్వర్ణకమలం.. కమల్ హాసన్‎తో స్వాతిముత్యం వంటి అపురూప చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా.. నటుడిగానూ సినీ ప్రియుల మన్ననలు అందుకున్నారు. తండ్రిగా… కుటుంబ పెద్దగా.. తప్పులు చేస్తే మందలిచ్చే తాతయ్యగా ఆయన వెండితెరపై కనిపించి ప్రేక్షకులను అలరించారు. దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిన విశ్వనాథ్ పోషించారు. ఎంతోమంది దిగ్గజ నటీనటులతో కలిసి పనిచేసిన ఆయనకు… లెజండరీ నటి తెలుగు ప్రేక్షకుల గయ్యాలి అత్త సూర్యకాంతం ఓ టైటిల్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

సెట్‏లో మెగాఫోన్ పట్టిన తర్వాత ఆయన ఒంటిపై కచ్చితంగా ఖాకీ డ్రెస్ ఉండాల్సిందే. ఇందుకు పెద్ద కథే ఉందన్నారు విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా ఉండి దర్శకుడిగా మారిన తర్వాత.. ఆ తలబిరుసు తనకు రావొద్దని ఆ డ్రెస్ ధరించేవారట. తన సినిమా కోసం పనిచేసే కార్మికులందరూ ఖాకీ దుస్తులు ధరించేవారని.. వారిలో తాను ఒకరు అని ప్రతిక్షణం గుర్తుచేసకోవడానికి.. దర్శకుడు అనే గర్వం రాకూడదని తాను ఇలా డ్రెస్ వేసుకునేవాడినని చెప్పుకొచ్చారు.

మా ఆర్ట్‌ డైరెక్టర్‌ కు తన డ్రెస్ నచ్చేది కాదని ఆఅన్నారు. ‘మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవరుగా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. ఓ జత రెడీ ఉన్నట్టుంటుంది’ అని చెప్పా! అది దొంగ మాటే అయినా.. అందులో కొంత నిజం లేకపోలేదు. తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేదని అన్నారు. ఇక ఇదే డ్రెస్ ను ఆపాదించుకుని నటి సూర్యకాంతం తనకు ఓ టైటిల్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఓ సినిమా షూటింగ్ సమయంలో నేను డైలాగ్ చెప్తున్నా వినకుండా బయటివాళ్లతో మాట్లాడుతున్నారు. రెండు సార్లు.. మూడు సార్లు చెప్తున్నాను.. అయినా ఏమిటో మాట్లాడుతున్నారు వేరేవాళ్లతో. దీంతో నేను కోప్పడ్డాను. నాకు కోసం వచ్చి ఎందుకోసం చెప్తున్నాను.. మాకేం పనిలేక చెప్తున్నానా? అని విసుక్కున్నాను. దీంతో ఆమె అబ్బో ఆయన కమాండర్ అండ్ చీఫ్ అని టైటిల్ ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.

Follow Us
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్