Air India: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు..! గాల్లో 184 మంది ప్రయాణికులు..!!
గత డిసెంబర్ 2022, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో దుబాయ్‌కి వెళ్లే సమయంలో పాము కనిపించింది.
విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం గాలిలో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కాలికట్ (కేరళ, కోజికోడ్)కు బయలుదేరింది. టేకాఫ్ అయి విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి అబుదాబి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు తెలిపారు.
డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ B737-800 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే విమానాన్ని విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ చేశారు. ఇంజన్‌లో ఒక్కసారిగా స్పార్క్ రావడానికి కారణం తెలియరాలేదని.. సమగ్ర విచారణకు ఆదేశించినట్టుగా వెల్లడించారు.
అదే సమయంలో ఎయిరిండియా విమానంలో ఇలా జరగడం ఇదేం తొలిసారి కాదు.. ఇప్పటికే జనవరి 23న తిరువనంతపురం నుంచి మస్కట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక సమస్యతో టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత మళ్లీ తిరువనంతపురంలో ల్యాండ్ అయింది. . అదేవిధంగా, గత డిసెంబర్ 2022, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో దుబాయ్‌కి వెళ్లే సమయంలో పాము కనిపించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..