బస్తాల కొద్ది1 రూపాయి కాయిన్స్.. పరిశీలించి చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది..
బంగారం స్మగ్లింగ్ చేయడం చూశాం.. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం చూశాం.. విదేశీ నోట్లను స్మగ్లింగ్ చేయడం చూశాం.. చివరకు దొంగ నోట్లు ముద్రించే ముఠాలను కూడా చూశాం.
బంగారం స్మగ్లింగ్ చేయడం చూశాం.. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం చూశాం.. విదేశీ నోట్లను స్మగ్లింగ్ చేయడం చూశాం.. చివరకు దొంగ నోట్లు ముద్రించే ముఠాలను కూడా చూశాం. మరి నకిలీ నాణెల గురించి ఎప్పుడైనా విన్నారా? వాటి స్మగ్లింగ్ గురించి మీకేమైనా తెలుసా? అయితే, ఇప్పుడు ఆ షాకింగ్ డీటెయిల్స్ తెలుసుకోండి. ముంబైలో నకిలీ నాణేలు చెలామణీకి సంబంధించి షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పది కాదు, వంద కాదు, వెయ్యి కాదు.. ఏకంగా రూ. 9 లక్షలకు పైగా విలువ చేసే నకిలీ నాణేలను ముంబై-ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో పట్టుకున్నారు. పదుల సంఖ్యలో బస్తాల్లో నకిలీ రూ. 1, రూ. 5, రూ. 10 నాణేలను స్మగ్లింగ్ చేస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. మలాద్ ప్రాంతంలో ఓ కారును తనిఖీ చేయగా.. అందులో ఈ బస్తాలు కనిపించాయి.
ఈ నకిలీ నాణేల వ్యవహారంపై ఢిల్లీ పోలీసులకు సమాచారం అందగా.. ముంబై పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని దాడులు చేశారు. కార్లను తనిఖీ చేస్తుండగా.. ఈ నకిలీ నాణేల ముఠా గుట్టు రట్టయ్యింది. తొలుత కారులో బస్తాలు ఏంటి? అని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు నిందితులు. దాంతో పోలీసులు బండిని పక్కకు తీసి.. తనిఖీలు చేశారు. బస్తాలను విప్పి పరిశీలించగా.. అన్నీ నకిలీ నాణేలే అని తేలింది. మొత్తం రూ. 9.46 లక్షల నకిలీ నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. వీటిని తరలిస్తున్న జిగ్నేశ్ గాలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలాఉంటే.. హర్యానాలో నకిలీ నాణేలను ముద్రిస్తున్నట్లు విచారణలో తెలిపాడు నిందితుడు. ఆ సమాచారం మేరకు సదరు కర్మాగారంపై దాడి చేసి, ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడ లభ్యమైన ఫేక్ నాణేలను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నాణేలను ప్రార్థనా మందిరాలు, ఇతర ప్రాంతాల్లో మార్చుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..