AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: అర్థరాత్రి నగ్నంగా వీధుల్లో హల్‌చల్ చేస్తున్న అమ్మాయి.. ఇల్లిల్లూ తిరుగుతూ ఏం చేస్తోందంటే..

ఓ స్త్రీ రేపు రా.. మా ఇంటికి రావొద్దు.. వంటివి దెయ్యాల పేరు చెప్పుకుని చేసే వైరల్ కొటేషన్, కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ అబద్ధాలని, ట్రాష్ అని కొట్టిపారేస్తున్నాం.

Shocking: అర్థరాత్రి నగ్నంగా వీధుల్లో హల్‌చల్ చేస్తున్న అమ్మాయి.. ఇల్లిల్లూ తిరుగుతూ ఏం చేస్తోందంటే..
Woman
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 03, 2023 | 6:59 PM

Share

ఓ స్త్రీ రేపు రా.. మా ఇంటికి రావొద్దు.. వంటివి దెయ్యాల పేరు చెప్పుకుని చేసే వైరల్ కొటేషన్, కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ అబద్ధాలని, ట్రాష్ అని కొట్టిపారేస్తున్నాం. కానీ, బాబోయ్ ఇది నిజమేనా? అని అనిపించేలా షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఓ అమ్మాయి అర్థరాత్రి వీధుల్లో హల్ చేస్తూ జనాలను హడలెత్తిస్తోంది. అట్టా ఇట్టా కాదు.. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా, నగ్నంగా వీధుల్లో సంచరిస్తూ ప్రతి ఇంటి గడపను తడుతోంది. వారి ఇళ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల మైండ్ బ్లాంక్ చేస్తోంది. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎవరు ఆ అమ్మాయి? ఎందుకిలా చేస్తోంది. అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని మిలాక్ గ్రామంలో ఓ యువతి ప్రవర్తన.. స్థానికులను హడలెత్తిస్తోంది. భయంతో వణికిపోతూ.. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. సరిగ్గా 25 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి. అర్థరాత్రి సమయంలో నగ్నంగా వీధుల్లో తిరుగుతోంది. అంతేకాదండోయ్.. వీధుల్లోని ఆయా ఇళ్ల డోర్ల వద్దకు వెళ్లి.. తలుపు తడుతోంది. వారి ఇళ్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కాలింగ్ బెల్ కూడా జనాలను హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ అర్థరాత్రి సమయంలో యువతి నగ్నంగా బయటకు రావడం, ఇళ్ల తలుపులను కొట్టడం పరిపాటిగా మారడంతో హడలిపోతున్నారు ప్రజలు. అయితే, యువతి నగ్నంగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు ఓ ఇంటి గుమ్మం వద్ద ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు స్థానిక ప్రజలు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి చర్య కారణంగా తాము ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నామని, ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు.. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తట్టడం వెనుక ఆమె ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు పోలీసులు. అయితే, నగ్నంగా తిరుగుతున్న యువతి ఎవరనేది గుర్తించలేకపోతున్నారు పోలీసులు. ఆమెను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ ఎవరైనా ఆ యువతిని చూస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112 కి కాల్ చేసి చెప్పాలని సూచించారు పోలీసులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..