AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఏపీ రాజకీయాల్లో ‘చిరు’ మంటలు.. అసలు మెగాస్టార్ ఏమన్నారు..? వైసీపీ రియాక్షన్ ఏంటీ..

Megastar Chiranjeevi Comments: చిరంజీవి పొలిటికల్‌ కామెంట్స్ ఏపీలో కాకరేపుతున్నాయ్‌!. సినిమాల సంగతి తర్వాత.. ముందు వాటి సంగతి చూడండి అంటూ మెగాస్టార్‌ సంధించిన అస్త్రాలు ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్‌. చిరంజీవి కామెంట్స్‌పై ముప్పేట దాడి చేస్తున్నారు వైసీపీ లీడర్స్‌. ఇంతకీ, మెగాస్టార్‌ ఏమన్నారు?. వైసీపీ నుంచి పడుతోన్న కౌంటర్స్‌ ఏంటి? వివరాల్లోకి వెళితే..

AP Politics: ఏపీ రాజకీయాల్లో ‘చిరు’ మంటలు.. అసలు మెగాస్టార్ ఏమన్నారు..? వైసీపీ రియాక్షన్ ఏంటీ..
YCP Leaders counter to Chiranjeevi
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2023 | 5:42 PM

Share

AP Politics: చిరంజీవి పొలిటికల్‌ కామెంట్స్ ఏపీలో కాకరేపుతున్నాయ్‌!. సినిమాల సంగతి తర్వాత.. ముందు వాటి సంగతి చూడండి అంటూ మెగాస్టార్‌ సంధించిన అస్త్రాలు ఆంధ్రాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్‌. చిరంజీవి కామెంట్స్‌పై ముప్పేట దాడి చేస్తున్నారు వైసీపీ లీడర్స్‌. ఇంతకీ, మెగాస్టార్‌ ఏమన్నారు?. వైసీపీ నుంచి పడుతోన్న కౌంటర్స్‌ ఏంటి? వివరాల్లోకి వెళితే.. పదేళ్లక్రితం రాజకీయాలను వదిలేసిన మెగాస్టార్‌ చిరంజీవి ఫస్ట్‌టైమ్‌ పొలిటీషియన్స్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు. అదీ కూడా ఏపీ రాజకీయ నేతలపై!. మా పనేదో మేం చేసుకుంటున్నామ్‌!. మీకెందుకయ్యా మా గురించి అంటూ డైరెక్ట్‌ ఎటాక్‌ చేశారు. సూటిగా సుత్తి లేకుండా ఎవరికి తగలాలో వాళ్లకే తగిలేలా సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ముందు, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదల గురించి ఆలోచించండి. ఇవిచేస్తే మీకు తలొంచి నమస్కరిస్తా!. ఇవన్నీ వదిలేసి.. పిచ్చుకలాంటి సినీ పరిశ్రమపై పడతారెందుకయ్యా అంటూ ప్రశ్నించారు. ఇదేదో దేశ సమస్య అన్నట్టు ప్రొజెక్ట్‌ చేస్తున్నారని మండిపడ్డారు మెగాస్టార్‌ చిరంజీవి.

వాల్తేరు వీరయ్య 200డేస్ ఫంక్షన్‌లో చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు ఏపీలో రాజకీయ కాకరేపుతున్నాయ్‌. అయితే, చిరంజీవి చేసిన ఈ కామెంట్స్‌నే… సరిగ్గా మూడ్రోజుక్రితం పవన్‌ కల్యాణ్‌ చేశారు. సినిమా సంగతి తర్వాత… ముందు వాటి పని చూడండయ్యా అంటూ ప్రభుత్వంపై అస్త్రాలు ఎక్కుపెట్టారు.

కొడాలి, పేర్ని కౌంటర్..

ఇంకేముంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వైసీపీ నేతలు ఒక్కొరుగా చిరంజీవికి పరోక్షంగా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో అటు చిరంజీవి, ఇటు పవన్‌ కల్యాణ్‌.. ఇద్దరికీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చేశారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. పకోడిగాళ్లు అంటూ ఘాటైన కామెంట్స్‌ చేశారు. ఆ సలహాలేవో నీ సినిమావాళ్లకు ఇచ్చుకో అంటూ ఒక రేంజ్‌లో నిప్పులు చెరిగారు కొడాలి.. పకోడిగాళ్లు మాకు సలహాలిస్తున్నారు.. ఆ సలహాలేవో సినీ ఇండస్ట్రీలో వాళ్లకు ఇవ్వాలి.. పవన్‌.. 4చోట్ల పోటీచేసినా ఓడిపోతారు.. అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చేలా కృషి చేయాలన్న సినీ నటుడు చిరంజీవి సూచనపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించినప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఏం చేశారని నాని ప్రశ్నించారు.

అంబటి, బొత్స ఫైర్..

ఏమ్‌… మీరు గిల్లితే మేం గిల్లిచ్చుకోవాలా? అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. మమ్మల్ని గిల్లుతున్నారు కాబట్టే… మేం రియాక్ట్‌ కావాల్సి వస్తోందంటున్నారు అంబటి. చిరంజీవి వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్‌ ఇచ్చారు.. సినీ పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకుంటున్నారా..? ఏపీలో పథకాలు అందరికీ అందుతున్నాయి.. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తోందంటూ మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..