Andhra Pradesh: గన్నవరం టీడీపీ టిక్కెట్ ఆయనకేనా ?.. పార్టీ మార్పు కన్ఫర్మ్ అయిందా ?..
కొంతకాలం నుంచి దుట్టా రామచంద్ర రావు మౌనంగా ఉంటున్నారు. అయితే యార్లగడ్డ,దుట్టా రామచంద్ర రావు ఈ మధ్య కాలంలో రెండుమూడుసార్లు కలిశారు. దుట్టా తో కలిసిన తర్వాత యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాన్ని రేకెత్తించాయి. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానంటూ యార్లగడ్డ పదేపదే చెబుతున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చ జరుగుతుంది.

కృష్ణా జిల్లా గన్నవరం లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత పార్టీలో గ్రూపు తగాదాలు స్టార్ట్ అయ్యాయి. వంశీపై వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వంశీకి వ్యతిరేకంగా యార్లగడ్డతో పాటు మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు రాజకీయాలు నడిపారు. వంశీకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే మద్దతు ఇచ్చేది లేదని దుట్టా రామచంద్రరావు స్పష్టం చేశారు. దీంతో స్వయంగా సీఎం జగన్ జోక్యం చేసుకుని పార్టీలో విభేదాలకు చెక్ పెట్టారు. అయినా వంశీ,యార్లగడ్డ,దుట్టా కలిసింది లేదు. కొంతకాలం నుంచి దుట్టా రామచంద్ర రావు మౌనంగా ఉంటున్నారు. అయితే యార్లగడ్డ,దుట్టా రామచంద్ర రావు ఈ మధ్య కాలంలో రెండుమూడుసార్లు కలిశారు. దుట్టా తో కలిసిన తర్వాత యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీలో కొనసాగుతారా లేదా అనే అనుమానాన్ని రేకెత్తించాయి. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానంటూ యార్లగడ్డ పదేపదే చెబుతున్నారు. తాజాగా యార్లగడ్డ వెంకట్రావు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చ జరుగుతుంది.
టీడీపీలో యార్లగడ్డ కు టిక్కెట్ కన్ఫర్మ్ అయిందంటున్న అనుచరులు
గన్నవరం లో యార్లగడ్డ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంతో ఆయన రాజకీయ భవిష్యత్తు పై జోరుగా చర్చ సాగుతోంది. ఒకవైపు వంశీ వైసీపీలో కొనసాగుతూ వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అయినా తాను కూడా గన్నవరం నుంచే పోటీ చేస్తానని యార్లగడ్డ చెప్తున్నారు. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. వంశీని విభేదించి వైసీపీకి దూరంగా ఉంటున్న వెంకట్రావు టీడీపీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర ఆగస్ట్ 21 వ తేదీన గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. పాదయాత్ర సమయంలో లోకేష్ సమక్షంలో పార్టీలో చేరుతారని యార్లగడ్డ సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఎలాగూ గన్నవరంలో టీడీపీకి ప్రస్తుతం ఇంఛార్జి ఎవరూ లేరు కాబట్టి యార్లగడ్డకు సీటు ఇస్తే గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.




యార్లగడ్డ టీడీపీలో చేరితే మారనున్న బలాబలాలు
2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా యార్లగడ్డకు ఇప్పటికీ బలం పెద్దగా తగ్గలేదు. మరోవైపు బాపులపాడు మండలంలో దుట్టా రామచంద్ర రావు తనకే మద్దతు ఇస్తారని ఆలోచనలో ఉన్నారు యార్లగడ్డ. అటు వంశీ కూడా సొంత ఇమేజ్ తో పాటు అభివృద్ధి, సంక్షేమంతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. యార్లగడ్డ టీడీపీకి వెళితే వైసీపీలో కొంతమంది ఆయన వెంట వెళ్లిపోయే అవకాశం ఉంది.వంశీ,యార్లగడ్డ వైసీపీ,టీడీపీ నుంచి పోటీ చేస్తే గెలుపు మాత్రం వన్ సైడ్ గా ఉండకపోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
