AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: వామపక్షలకు గులాబీ టిక్కెట్.. సీఎం కేసీఆర్ తాజా సర్వేపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..

సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఫైనల్ గా జరిగే సర్వే ఆధారంగానే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇద్దరు లేదా ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి సర్వేలు అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు సర్ది చెప్పి పంపుతున్నారు. దీంతో తమకు సర్వేలు అనుకూలంగా లేకపోతే పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. ఈ మధ్య 87 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ ప్రత్యామ్నా నేతలు తీరుపై సర్వే చేస్తే 53 మందికి టికెట్ మార్చాల్సిందే..

Telangana Elections: వామపక్షలకు గులాబీ టిక్కెట్.. సీఎం కేసీఆర్ తాజా సర్వేపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..
CM KCR - BRS Party
Sridhar Prasad
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 12, 2023 | 2:22 PM

Share

సర్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. టికెట్ ప్రస్తుత ఎమ్మెల్యేకే ఇవ్వాళ లేక ప్రత్యామ్నాయ నేతలకు ఇవాళా అన్న కోణంలో జరుగుతున్న సర్వేలు కొలిక్కి రాబోతున్నాయి. సిట్టింగ్‌ల్లో 50 కి పైగా ఎమ్మెల్యేలకు ఎదురు గాలి వీస్తున్నట్లు వస్తున్న సర్వేలు అధిష్టానానికి కూడా తికమక పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరికల్లా అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్ లోనే 90 కి పైగా టికెట్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ప్రగతి భవన్‌లో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. ఫైనల్ గా జరిగే సర్వే ఆధారంగానే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇద్దరు లేదా ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి సర్వేలు అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తామని పార్టీ పెద్దలు సర్ది చెప్పి పంపుతున్నారు. దీంతో తమకు సర్వేలు అనుకూలంగా లేకపోతే పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. ఈ మధ్య 87 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వర్సెస్ ప్రత్యామ్నా నేతలు తీరుపై సర్వే చేస్తే 53 మందికి టికెట్ మార్చాల్సిందే అని రిపోర్ట్ వచ్చిందట. ఇందులో ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచే అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత మందిని మార్చితే.. వాళ్ళు ఇంకో పార్టీలో చేరితే ఎలా అని పార్టీ ముఖ్య నేతలు తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.

టికెట్ దక్కని సిట్టింగ్‌లు విపక్ష పార్టీలో చేరితే.. అది వారికి ప్లస్ అవుతుందా? అనే కోణంలో కూడా సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితి ఉన్న దగ్గర సిట్టింగులు చేజారకుండా వారికి ఎమ్మెల్సీ పదవి లాంటివి ఆశ చూపి బుజ్జగించే యోచనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇన్నాళ్లు వామపక్షాలతో బిఆర్ఎస్ పొత్తుపై ఉన్న సస్పెన్స్ కూడా వీడినట్లు తెలుస్తోంది. మునుగోడు టిక్కెట్‌ను సీపీఐకి ఇచ్చేందుకు గులాబీ దళపతి కేసీఆర్ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..