AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రి నిర్వాకంపై సామాన్యుడి పోరుబాట!

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రిపై సామాన్యుడు పోరుబాటపట్టాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య కోమాలోకి వెళ్లిందన్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారంటూ.. జిల్లా కలెక్టరేట్ ముందు వినూత్న రీతిలో ఆందోళనకు దిగాడు.

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రి నిర్వాకంపై సామాన్యుడి పోరుబాట!
Private Hospital Negligence
Nalluri Naresh
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 7:22 AM

Share

దవాఖానా? లేదంటే దగాఖానా? ఓ ప్రయివేటు ఆస్పత్రిపై సామాన్యుడు పోరుబాటపట్టాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య కోమాలోకి వెళ్లిందన్నాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాడుతున్నారు. న్యాయం చేయాల్సిన అధికారులు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారంటూ.. జిల్లా కలెక్టరేట్ ముందు వినూత్న రీతిలో ఆందోళనకు దిగాడు.

శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ప్రైవేటు హాస్పిటల్‌ నిర్వాకానికి, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వెంకట గారి పల్లి గ్రామానికి చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అనారోగ్యంతో వున్న తన భార్య జ్యోతిని అంబులెన్స్‌లో పుట్టపర్తి కలెక్టరేట్‌కు తీసుకెళ్లారు. ధర్మవరంలోని దేవి నర్సింగ్‌లో మత్తు ఇంజెక్షన్‌ ఎక్కువ డోస్‌ ఇవ్వడం వల్లే, తన భార్య కోమాలోకి వెళ్లిందని ఆరోపించారురు. 14 నెలలుగా ఎన్నో ఆసుపత్రల చుట్టూ తిరిగామని, కోటి రూపాయిలకు పైగా ఖర్చయిదన్నారు. కానీ తన భార్య ఆరోగ్యం నయం కాలేదని వాపోయారు. తమ ఈ దుస్థితికి కారణం ధర్మవరం దేవి నర్సింగ్‌ హోమ్‌ వైద్యులేనని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమలా మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకుండా సదరు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం చేయాల్సిన అధికారులు ఫిర్యాదు చేస్తే తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రి నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు ప్రసాద్‌. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానన్నారు. ప్రయివేటు ఆసుపత్రిపై కంప్లేంట్‌ ఇస్తే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రసాద్‌కు భరోసానిచ్చారు పుట్టపర్తి జిల్లా కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us