Gold Price Today: మహిళలకు పండగే.. పండగ.. రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం, వెండి ధరలు
Gold, Silver Prices Today: వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. చరిత్రలో ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్నాయి. ఈసారి బంగారం ధర ఎందుకు పడిపోతోంది?: ఈసారి బంగారం ధరలు తగ్గడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. బలమైన..

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు ఇటీవల గణనీయమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 1983 తర్వాత అత్యంత దారుణమైన వారంలో ఇప్పటికే దాదాపు 11% నష్టపోయిన బంగారం ధరలు, కామెక్స్‌లో ఈరోజు 3% తగ్గి ఔన్సుకు $4,462 కు పడిపోయాయి. అదే సమయంలో సోమవారం ఆసియా ట్రేడింగ్‌లో కామెక్స్‌లో వెండి ధరలు 3% తగ్గి ఔన్సుకు $67.5 కు చేరాయి. తాజాగా మార్చి 24న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద ట్రేడవుతోంది.
ఇది కూడా చదవండి: Telangana: సంచలన నిర్ణయం.. తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు
2026 మార్చి 23 ఉదయం, MCX గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 4% తగ్గి 10 గ్రాములకు రూ. 138700 కు పడిపోగా, MCX సిల్వర్ మే కాంట్రాక్ట్ 7% తగ్గి కిలోకు రూ. 220197 కు పడిపోయింది.
అయితే మార్చి 24న మంగళవారం కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే రూ.10320 తగ్గింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,490 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,190 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,27,590 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,340 వద్ద కొనసాగుతోంది.
- ఇక వెండి విషయానికొస్తే నిన్న ఒక్క రోజే 15000 తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,29,900 వద్ద కొనసాగుతోంది.
Telangana: తెలంగాణలో ధనిక జిల్లాల జాబితా.. రెండో స్థానంలో హైదరాబాద్.. టాప్‌లో ఏదంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
