AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSB SI Jobs 2026: నెలకు రూ.1,12,400 జీతంతో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు!

SSB Sub Inspector SI Non-GD Jobs 2026: సశస్త్ర సీమా బల్ లో గ్రూప్-'సి' నాన్-గెజిటెడ్ కింద స్టాఫ్ నర్స్, పయనీర్, కమ్యూనికేషన్ విభాగాల్లో సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం

SSB SI Jobs 2026: నెలకు రూ.1,12,400 జీతంతో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు!
SSB Sub Inspector Recruitment
Srilakshmi C
|

Updated on: Mar 24, 2026 | 6:17 AM

Share

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సశస్త్ర సీమా బల్ (SSB).. గ్రూప్-‘సి’ నాన్-గెజిటెడ్ కింద స్టాఫ్ నర్స్, పయనీర్, కమ్యూనికేషన్ విభాగాల్లో సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 51 సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

సశస్త్ర సీమాబల్‌లో సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

  • సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు: 10
  • సబ్ ఇన్స్పెక్టర్ (పయనీర్) పోస్టులు: 21
  • సబ్ ఇన్స్పెక్టర్ (కమ్యూనికేషన్) పోస్టులు: 20

సశస్త్ర సీమాబల్‌లో సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

స్టాఫ్ నర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో డిప్లొమా సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. అలాగే నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి. పయనీర్‌ పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక కమ్యూనికేషన్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటి ఇంజినీరింగ్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకూడదు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పరీక్ష ఫీజు కింద జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్ధులు రూ.200 చొప్పున చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ ప్రకటన మార్చి 21, 2026న వెలువడింది. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (PET), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (PST), రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతంగా చెల్లిస్తారు. నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

సశస్త్ర సీమాబల్‌లో సబ్-ఇన్స్పెక్టర్ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us