AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ

పండగలు, వ్రతాల సమయంలో పూజా సామాగ్రి, దేవుడి విగ్రహాలను శుభ్రం చేయడం చాలా మందికి సవాలుగా ఉంటుంది. రాగి, ఇత్తడి వస్తువులను రుద్ది రుద్ది చేతులు నొప్పి పెట్టకుండా, కేవలం నీటిలో ముంచి తేలికగా తల తల మెరిపించే సులభమైన పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు, కుంకుమ మరకలను కూడా సమర్థవంతంగా తొలగించి, విగ్రహాలను శుభ్రం చేసుకోవచ్చు.

రుద్దాల్సిన పని కూడా లేదు.. ఈ నీటిలో ముంచితే చాలు పూజా సామాగ్రి తళతళ
Pooja Samagri Cleaning
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2026 | 1:41 PM

Share

పండగలు, నోములు, వ్రతాలు, శుక్రవారాలు, మంగళవారాల వంటి ప్రత్యేక సందర్భాలలో పూజా సామాగ్రిని శుభ్రం చేయడం ఒక ముఖ్యమైన పని. అయితే, రాగి, ఇత్తడి వస్తువులను చేతులతో రుద్ది రుద్ది శుభ్రం చేయడం శ్రమతో కూడుకున్న పని. ఇది చాలామందికి చేతులు నొప్పి పుట్టేలా చేస్తుంది. అలాగే, దేవుడి విగ్రహాలపై పసుపు, కుంకుమ మరకలు అంటుకుని, వాటిని తొలగించడం చాలా కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ మరకలు ఎంత ప్రయత్నించినా పోవు. ఈ కథనంలో, పూజా సామాగ్రిని, దేవుడి విగ్రహాలను సులభంగా, సమర్థవంతంగా ఎలా శుభ్రం చేయాలో వివరంగా తెలుసుకుందాం.

ముందుగా ఒక టబ్‌లోకి నీళ్లని తీసుకోవాలి. అందులో మీ పూజా సామాగ్రి మునిగేంతంగా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిలో రాళ్ల ఉప్పు రెండు చెంచాలతో పాటు మనం గిన్నెల తోమే లిక్వెడ్ సైతం సరిపడినంత యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర లిక్విడ్ లేకపోతే దుస్తులు ఉతికే సర్ప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సర్ప్ అయితే 3 స్పూన్స్ వేసుకోవాలి. నిమ్మ ఉప్పు కూడా కొంత యాడ్ చేసుకోవాలి. నిమ్మ ఉప్పు లేకపోతే 2 నిమ్మికాయలు పిండుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిలో పూజా సామాగ్రిని కాసేపు ఉంచి తీస్తే.. మొత్తం చెత్త అంతా రిమూవ్ అవుతుంది.

ఈ పద్దతిలో  చేత్తో రుద్దే పని లేకుండా, కేవలం నీటిలో ముంచడం ద్వారా ఈ వస్తువులను తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. ఇది రాగి, ఇత్తడి వస్తువులతో పాటు, పసుపు, కుంకుమ మరకలు పట్టిన దేవుడి విగ్రహాలకు కూడా వర్తిస్తుం. ఈ సులభమైన పద్ధతితో మీరు ఎటువంటి శ్రమ లేకుండా మీ పూజా సామాగ్రిని, దేవుడి విగ్రహాలను శుభ్రంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు.

Follow Us