AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటుపరంపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ఉద్యమంలో ఇప్పుడేం జరగబోతోంది..?

వాట్‌ నెక్స్ట్‌..ఏం జరగబోతోంది..? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమకారుల యాక్షన్‌ ప్లానేంటి..? ఉక్కు సంకల్పంతో ముందడుగు వేస్తారా..? స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటారా..? ఇప్పటికే రిలే..

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటుపరంపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన నేపథ్యంలో విశాఖ స్టీల్ ఉద్యమంలో ఇప్పుడేం జరగబోతోంది..?
Venkata Narayana
|

Updated on: Feb 25, 2021 | 8:00 AM

Share

వాట్‌ నెక్స్ట్‌..ఏం జరగబోతోంది..? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమకారుల యాక్షన్‌ ప్లానేంటి..? ఉక్కు సంకల్పంతో ముందడుగు వేస్తారా..? స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటారా..? ఇప్పటికే రిలే దీక్షలతో స్టీల్‌ సిటీని హీటెక్కిస్తున్న ఉద్యమకారుల నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటి..? లక్ష్య సాధన కోసం జెండాలు, అజెండాలు పక్కనబెట్టి..ఒకే తాటిపై కలిసి నడుస్తారా..? ఇప్పటివరకు ఓ ఎత్తు..ఇప్పుడు మరో ఎత్తు. ఎందుకంటే..ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ప్రైవేటీకరణతోనే దేశాభివృద్ది సాధ్యమని స్పష్టం చేశారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా..అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.

నిన్న ప్రధాని మోదీ తాజా వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకు ఎంత దూరమైనా వెళ్తామంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వ్యాపార ధోరణితో చూడొదని..స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయిస్తే లాభాలొస్తాయంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ అధ్యయనం కోసం ఇంటర్‌ మినిస్టీరియల్‌ గ్రూప్‌..విశాఖకు వస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోల నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక, పొలిటికల్ పార్టీల్లో విశాఖ ఉక్కుకు సంబంధించి ఎలాంటి వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు సాగుతాయన్నది కీలకంగా మారింది.

ఇలా ఉండగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (దీపమ్‌) ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యం వ్యాపారం కాదన్నారు మోదీ. ప్రైవేటీకరణ తోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు. వారసత్వంగా వస్తున్నాయన్న పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని స్పష్టం చేశారు. పీఎస్‌యూలను నడపడానికి ఆర్థిక సాయం అందించడం భారమని వ్యాఖ్యానించారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని మోదీ చెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని రంగాల ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు.

వ్యాపారం అనేది ప్రభుత్వ వ్యవహారం కాదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వ్యాపార రంగానికి ప్రభుత్వం తనవంతు తోడ్పాటునందిస్తుందని మోదీ చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని వివరించారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్లుతున్నామని చెప్పారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందన్నారు. ప్రైవేటు రంగం పెట్టుబడులు, అత్యుత్తమ విధానాలను తెస్తుందని వివరించారు. ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరు అని వివరించారు.

50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమని మోదీ తేల్చి చెప్పారు. ప్రజాధనం సద్వినియోగమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన బాటలను బడ్జెట్‌ వేసిందని మోదీ అన్నారు. 18 రంగాల ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్‌ , ఇన్సూరెన్స్‌ , ఎరువులు , పెట్రోలియం , డిఫెన్స్‌ ఉత్పత్తి రంగాలకే ప్రభుత్వ పాత్ర పరిమితం కాబోతోంది.

Read also :

ఒకప్పటి కరువు ప్రాంతాలు, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో మారుమ్రోగుతున్నాయి,. ఏవి.. ఆ రెండు తెలుగు ప్రాంతాలు, ఏమా కథ.?