YS Sunitha TDP Poster: వైఎస్‌ సునీత పోస్టర్ల వెనుక నిజం ఇదేనా.. ప్రొద్దుటూరులో పొలిటికల్ పొగ..

YS సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారా..? కడప జిల్లా ప్రొద్దుటూరులో సునీత ఫొటోలతో పోస్టర్లు వేసింది ఎవరు..? ఈ అంశంపై టీడీపీ రియాక్షన్‌ ఏంటి..? YS వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ఈ పోస్టర్ల వెనుక ఇంకేదైనా కారణం ఉందా..?

YS Sunitha TDP Poster: వైఎస్‌ సునీత పోస్టర్ల వెనుక నిజం ఇదేనా.. ప్రొద్దుటూరులో పొలిటికల్ పొగ..
Ys Sunitha Tdp Poster
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 25, 2023 | 7:50 PM

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్‌ సునీతా పోస్టర్లు కలకలం రేపాయి. సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లలో తెలుగుదేశంపార్టీ అని ఉంది. అలాగే సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, తండ్రి వివేకా ఫొటోలు కూడా పోస్టర్లలో ఉన్నాయి. వివేకా హత్య కేసులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు డాక్టర్‌ సునీత పోరాటం చేస్తున్న సమయంలో ఈ పోస్టర్లు వేయడం చర్చగా మారింది. తాజాగా పోస్టర్లు అంటించినవారి దృశ్యాలు కూడా సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. తాజాగా ఆ వీడియోలు బయటకు రావడం మరింత కలకలం రేపుతోంది.

వైఎస్ సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ ఆ పోస్టర్లలో ఉంది. ప్రొద్దుటూరు YMR కాలనీ ఆంజనేయస్వామి గుడి దగ్గర టీస్టాల్ గోడలపై ఈ పోస్టర్లు అంటించారు. పైగా తెలుగుదేశంపార్టీ అని ఉన్న పోస్టర్లలో YS సునీతతోపాటు… ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, తండ్రి YS వివేక.. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్‌, అచ్చెన్నాయుడు, శ్రీనివాసులరెడ్డి, బీటెక్‌ రవిల ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్లు ఎవరు వేశారన్నది మిస్టరీగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని తొలగించారు.

రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో సునీత పోస్టర్లపై స్పందించారు ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్‌ ప్రవీణ్‌. వివేక హత్య కేసును డైవర్ట్‌ చేయడానికే సునీతపై ఈ విధంగా పోస్టర్లు వేశారని మండిపడ్డారు. పోస్టర్లతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ప్రవీణ్‌. ఆ పోస్టర్లతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. పోలీసులు విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రొద్దుటూరులోనే ఎందుకు పోస్టర్లు వేశారు..?

ఇంతకీ YS సునీత రాజకీయ ప్రవేశంపై ప్రొద్దుటూరులోనే ఎందుకు పోస్టర్లు వేశారు..? ప్రొద్దుటూరుకు సునీతకు సంబంధం ఏంటి..? ఇది సునీత చర్యలను విభేదిస్తున్నవారి పనా..? లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా..? ఈ ప్రశ్నలపైనే చర్చ జరుగుతోంది. మరి సునీత పోస్టర్లు ఎవరు వేశారు ఎందుకు వేశారు టీడీపీ ఆరోపిస్తున్నట్టు డైవర్షన్ పాలిటిక్సేనా? లేదంటే ఆకతాయిలు కావాలనే చేశారా? పోలీసుల విచారణలోనే నిజాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం