Video Watch: అర్ధారాత్రి నెల్లూరులో వింత దొంగలు.. డాగ్ స్టోర్‌లో చోరీ.. సీసీటీవీలో రికార్డ్.. కట్ చేస్తే..

ఊళ్ళ‌కు వెళితే, ప‌ట్ట‌ప‌గ‌లే ఇళ్ళ‌ల్లోకి దూరిన సంద‌ర్భాలు అనేకం చూశాం. కానీ ఈ దొంగ‌త‌నం మాత్రం విచిత్ర‌మైంది. ఇళ్ళ‌ల్లో ముద్దుగా పెంచుకునే పెట్స్ ని ఎత్తుకెళ్ళ‌డం సంచ‌ల‌నంగా మారింది. అది కూడా బ్యాంకు దొంగ‌త‌నం చేయ‌డానికో..

Video Watch: అర్ధారాత్రి నెల్లూరులో వింత దొంగలు.. డాగ్ స్టోర్‌లో చోరీ.. సీసీటీవీలో రికార్డ్.. కట్ చేస్తే..
Dogs
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 25, 2023 | 8:04 PM

వేస‌వికాలం వ‌చ్చిందంటే చాలు దొంగ‌లు రెచ్చిపోతుంటారు. తాళాలు వేసిన ఇళ్ళ‌ను ఎంచుకుని అర్ద‌రాత్రి ఇంట్లోకి చొర‌బ‌డి దొరికిన‌దంతా దోచుకెళుతుంటారు. ఊళ్ళ‌కు వెళితే, ప‌ట్ట‌ప‌గ‌లే ఇళ్ళ‌ల్లోకి దూరిన సంద‌ర్భాలు అనేకం చూశాం. కానీ ఈ దొంగ‌త‌నం మాత్రం విచిత్ర‌మైంది. ఇళ్ళ‌ల్లో ముద్దుగా పెంచుకునే పెట్స్ ని ఎత్తుకెళ్ళ‌డం సంచ‌ల‌నంగా మారింది. అది కూడా బ్యాంకు దొంగ‌త‌నం చేయ‌డానికో, లేదా ఏటీఎం కొల్ల‌గొట్ట‌డానికో వ‌చ్చిన‌ట్లు మాస్కులు వేసుకుని మ‌రీ వ‌చ్చి దొంగ‌త‌నం చేశారు. ఇలాంటి చిత్ర‌మైన ఘ‌ట‌న రాష్ట్రంలో ఇదే తొలిసారి అని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. నెల్లూరు న‌గ‌రంలో ఈ దొంగ‌త‌నం జ‌రిగింది.

ఇక వివ‌రాల్లోకి వెళితే.. నెల్లూరు న‌గ‌రంలో వీఆర్సీ సెంట‌ర్ వ‌ద్ద ఓ పెట్స్ షాప్ ఉంది. దేశ‌విదేశాల నుంచి ఎన్నో ర‌కాల ప‌క్షులు, పెంపుడు కుక్క‌లు, పిల్లులు తెచ్చి ఈ షాప్ లో విక్ర‌యిస్తుంటారు. ఎన్నో ర‌కాల బ్రీడ్ పెట్స్ ఇక్క‌డ ఉన్నాయి. ఇటీవ‌లికాలంలో ఈ పెట్స్ కి విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. భారీ రేటు పెట్టి నెల్లూరు వాసులు కొనుగోలు చేస్తున్నారు. వీటి మీద క‌న్ను ప‌డిందో ఏమో, కొంత‌మంది అర్ధ‌రాత్రి షాపులో దూరి పెంపుడు జంతువుల‌ను ఎత్తుకెళ్ళారు. ముఖానికి మాస్కులు వేసుకుని చ‌డీచ‌ప్పుడూ లేకుండా కుక్క‌లు, పిల్లుల‌ను తీసుకుపోయారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఎంత సైలెంట్‌గా వ‌చ్చారో, అంతే సైలెంట్‌గా ప‌ని కానిచ్చేసి ప‌రార‌య్యారు. తెల్ల‌వారిన త‌ర్వాత షాపు తెరిచేందుకు వ‌చ్చిన య‌జ‌మానులు దొంగ‌త‌నం జ‌రిగింద‌ని, పెట్స్ ని ఎత్తుకుపోయార‌ని తెలుసుకుని వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేక‌రించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. మ‌రోవైపు షాపు స‌మీపంలో ఉన్న సీసీ కెమెరాలో దొంగ‌త‌నం జ‌రిగిన దృశ్యాలు రికార్డ‌య్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్