Andhra Weather: వెదర్ అప్‌డేట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. ఈ నెల 5 లేదా 6న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో విస్తరించింది ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాం లో దిగువ ట్రోపో ఆవరణం లో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు, ఉష్ణోగ్రతలు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తాచ యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాాతావరణ శాఖ తెలిపింది. శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశము వుందని పేర్కొంది.
ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఏర్పడితే.. నవంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..